Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క విద్యార్థి కోసం 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్.. టీచర్‌కు సెల్యూట్..!

ఒక్క విద్యార్థి కోసం 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్.. టీచర్‌కు సెల్యూట్..!

వార్త 2 weeks ago

Salute to This Teacher : ఒక్క విద్యార్థి కోసం ఓ టీచర్ ప్రతిరోజూ 5 కిలోమీటర్లు అడవిలో నడుస్తూ పాఠశాలకు వెళ్తున్నారు. విద్యపై ఆయనకున్న నిబద్ధత ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గగన్‌బావడా తాలూకాలోని కవల్టెక్ ధంగర్‌వాడా జిల్లా పరిషత్ పాఠశాలలో 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ మిథారి (Salute to This Teacher) ఈ అసాధారణ సేవ చేస్తున్నారు.

జీవన్ మిథారి గత 13 ఏళ్లుగా :

2013 జూలై 26న ఈ మారుమూల పాఠశాలలో విధుల్లో చేరిన జీవన్ మిథారి గత 13 ఏళ్లుగా అక్కడే బోధిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం వరకు రహదారి సౌకర్యం లేదు. దీంతో ప్రతిరోజూ దాదాపు 5 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది. వర్షం, ఎండ మాత్రమే కాదు.. గవులు, చిరుతలు వంటి వన్యప్రాణులు సంచరించే దట్టమైన అడవిలో ప్రయాణించాల్సి రావడం మరింత ప్రమాదకరం.

ఒకప్పుడు ఈ ప్రాంతంలో 70 నుంచి 100 కుటుంబాలు నివసించేవి. అయితే ఉపాధి కోసం కుటుంబాలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడంతో గ్రామంలో జనాభా తగ్గిపోయింది. దాని ప్రభావం పాఠశాలపైనా పడింది. ప్రస్తుతం మూడో తరగతిలో స్వరా బోడకే మాత్రమే అధికారికంగా చదువుతోంది. ఆమె చిన్న చెల్లెలు కూడా పాఠశాలకు వస్తున్నప్పటికీ, ఇంకా పాఠశాల వయసుకు రాకపోవడంతో అధికారిక విద్యార్థిగా నమోదు కాలేదు.

విద్యార్థుల సంఖ్య తగ్గినా తన బాధ్యత తగ్గదని మిథారి భావిస్తున్నారు. ఇతరులు ఇష్టపడని ఈ మారుమూల ప్రాంతానికి తానే స్వచ్ఛందంగా బదిలీ తీసుకున్న ఆయన.. ఒక్క చిన్నారి చదువు ఆగిపోకూడదనే సంకల్పంతో ప్రతిరోజూ ఈ కఠినమైన ప్రయాణం చేస్తున్నారు. ఒక విద్యార్థి కోసం ఐదు కిలోమీటర్ల అడవి బాటలో నడిచే ఈ గురువు కథ.. "విద్యార్థుల సంఖ్య కాదు, వారి భవిష్యత్తే ముఖ్యం" అనే సందేశాన్ని దేశానికి అందిస్తోంది. నిజమైన ఉపాధ్యాయుడి అంకితభావానికి జీవన్ మిథారి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.

జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు.. అందుకే నీటిని కోల్పోయాం : కోమటిరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha