Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్కో పేపర్‌కు రూ. 5 లక్షల డీల్.. సికార్ కోచింగ్ సెంటర్లే టార్గెట్!

ఒక్కో పేపర్‌కు రూ. 5 లక్షల డీల్.. సికార్ కోచింగ్ సెంటర్లే టార్గెట్!

వార్త 1 week ago

డాక్టర్ కావాలనే కోరికతో రాత్రీపగలూ కష్టపడి చదివి ఆ వృత్తికి న్యాయం చేయాలనే తపనతో నీట్ ఎక్సమ్ రాస్తారు. కాని కొందరు పేపెర్ను ముందే డబ్బుతో కొని అడ్డదారుల్లో డాక్టర్ కావాలని తపిస్తున్నారు.

దీనితో పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ స్కామ్: ఒక్కో పేపర్‌కు రూ. 5 లక్షల డీల్.. సికార్ కోచింగ్ సెంటర్లే టార్గెట్! నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో నిందితులు విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూలు చేయడమే కాకుండా, పేపర్ పంపిణీ కోసం అత్యంత పక్కాగా నెట్‌వర్క్ నడిపినట్లు ఆధారాలు లభించాయి.

Read Also: Tamil Nadu: అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి.. విజయ్ పాత ఇంటర్వ్యూ

 NEET-UG 2026

NEET-UG 2026: అక్షరాలా రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వసూలు

నీట్ ప్రశ్నపత్రాలను ముందే పొందేందుకు దళారులు విద్యార్థులతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. ప్రధానంగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లో యశ్ యాదవ్, వికాస్ బీవాల్ , దినేష్ బీవాల్ కీలక పాత్ర పోషించారు. నిందితుడు దినేష్ బీవాల్ నీట్ ప్రశ్నపత్రం యొక్క హార్డ్ కాపీని సంపాదించి, దానిని స్కాన్ చేశాడు. ప్రశ్నపత్రం ట్రేస్ కాకుండా ఉండేందుకు, స్కానింగ్ చేసే ముందు కొన్ని కీలక అంశాలను చేతితో రాసి, ఆపై పీడీఎఫ్ (PDF) ఫైల్స్‌గా మార్చి విద్యార్థులకు వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు తేలింది. లీకైన ఈ ప్రశ్నపత్రాలు రాజస్థాన్‌లోని పలు కోచింగ్ సెంటర్ల నెట్‌వర్క్ ద్వారా వేగంగా పంపిణీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న సీబీఐ, ఈ స్కామ్‌లో అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయంపై ఆరా తీస్తోంది. ముఖ్యంగా హార్డ్ కాపీ ఏ మూలం నుంచి బయటకు వచ్చిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha