Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒమన్ తీరంలో మరో చమురు నౌకపై దాడి?.. క్లారిటీ ఇచ్చిన భారత్‌

ఒమన్ తీరంలో మరో చమురు నౌకపై దాడి?.. క్లారిటీ ఇచ్చిన భారత్‌

వార్త 22 hrs ago

Oman coast ship attack: ఒమన్ తీరంలో భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న మరో చమురు నౌకపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలపై భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది.

ఈ ఘటనకు సంబంధించి నౌకలోని పరిస్థితులను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నౌకకు సంబంధించిన కెప్టెన్‌తో భారత అధికారులు ఇప్పటికే నేరుగా మాట్లాడారని, అందులోని సిబ్బంది అంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also : Oman Coast Ship Attack: భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం

 Another oil tanker attacked off the coast of Oman? India clarifies.

Oman coast ship attack: క్షిపణి దాడి వార్తలు పూర్తిగా అవాస్తవం

భారత సిబ్బందితో ఉన్న ఒక నౌక ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తోంది. నౌక నుంచి ఒక్కసారిగా స్పందన ఆగిపోవడంతో.. దానిపై అమెరికా దాడి చేసిందంటూ పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో నలుగురు భారతీయ నావికులు మరణించారంటూ ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్దఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగశాఖ స్పందించింది. ఆ నౌకలోని మాస్టర్తో మాట్లాడినట్లు పేర్కొంది. నౌకపై ఎలాంటి దాడి జరగలేదని ధ్రువీకరించింది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ప్రస్తుతానికి నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ జలాల్లో ఈ చమురు నౌకపై అసలు దాడి ఎందుకు జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉందనే విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారతీయులు ఉన్న నౌకలపై వరుసగా దాడులు జరిగాయి. వారం వ్యవధిలో మూడు నౌకలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ చర్యలను ఆపేయాలంటూ అమెరికా వద్ద నిరసన వ్యక్తం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత వాణిజ్య నౌకపై దాడులను ఖండించిన ట్రంప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha