Dailyhunt
Online: ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!

Online: ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!

వార్త 1 month ago

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నేడు కేవలం వడ్డీ రేట్లనే కాకుండా.. సామాన్య బ్యాంక్ కస్టమర్ల భద్రతకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించింది.

నేటి కాలంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు (Frauds) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీనిని అరికట్టడానికి , బాధితులను ఆదుకోవడానికి గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. బాధితులకు ఆర్ధిక భరోసా డిజిటల్ లావాదేవీల్లో మోసపోయిన వారికి ఊరటనిస్తూ, చిన్న తరహా ఫ్రాడ్ లావాదేవీలకు సంబంధించి రూ. 25,000 వరకు పరిహారం అందించేలా కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నట్లు ఆర్‌బీఐ (RBI) తెలిపింది. 'చాలా కాలంగా కస్టమర్లు ఎదుర్కొంటున్న సైబర్ మోసాల విషయంలో మేము అనేక చర్యలు తీసుకున్నాము.

అమెరికాతో కుదురుతున్న ఒప్పందాలు భారత వృద్ధికి ఊతం

ఇప్పుడు నేరుగా కస్టమర్లకు నష్టపరిహారం అందించే దిశగా అడుగులు వేస్తున్నాము' అని గవర్నర్ పేర్కొన్నారు. దీనివల్ల సామాన్యుల్లో డిజిటల్ లావాదేవీలపై మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అదనపు అథెంటికేషన్ పద్ధతులను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక భద్రతా ఫీచర్లను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నారు. వృద్ధి రేటు అంచనాలు పెంపు భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉందని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం, అమెరికాతో కుదురుతున్న ఒప్పందాలు భారత వృద్ధికి ఊతం ఇస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2026 ఆర్థిక సంవత్సరానికి (FY26) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.3% నుంచి 7.4%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం బలమైన వృద్ధిని నమోదు చేస్తోందని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అవి ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6% పరిమితిలోనే ఉంటాయని గవర్నర్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Ola Uber Rapido Strike: రేపు దేశవ్యాప్త క్యాబ్ మరియు బైక్ టాక్సీల సమ్మె

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha