Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగింపు

Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగింపు

వార్త 3 months ago

Operation Kagar: ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీకి చెందిన టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ముందు లొంగిపోయారు.

ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయినట్లు సమాచారం.

మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దేవ్‌జీ మరియు రాజిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్-2 ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఒత్తిడితోనే వారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారులు రెండు రోజుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం నక్సల్స్‌పై భద్రతా బలగాల పోరులో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha