Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒప్పందం కుదరకపోతే భారీ స్థాయిలో దాడులు..ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ఒప్పందం కుదరకపోతే భారీ స్థాయిలో దాడులు..ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

వార్త 4 days ago

Trump warns Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు దేశాల మధ్య దాడులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ, ప్రతిష్టంభన మాత్రం అలాగే కొనసాగుతోంది.

వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇరాన్‌కు పరిమిత సమయం మాత్రమే ఇస్తున్నామని, ఈ లోగా ఒప్పందం కుదరకపోతే రాబోయే 2-3 రోజుల్లో లేదా వచ్చే వారం ఆరంభంలో భారీ స్థాయిలో దాడులు చేయడానికి సైన్యాన్ని సిద్ధం కావాలని ఆదేశించినట్లు తెలిపారు. నిజానికి మంగళవారమే పెద్ద ఎత్తున దాడులు చేయాలని భావించినప్పటికీ.. అరబ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు, అలాగే ప్రస్తుతం చర్చలు జరుగుతుండటం వల్ల ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు.

Read Also: Submarine Cables: టెక్ దిగ్గజాలకు ఇరాన్ షాక్: సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఆర్మీ

 Trump warns Iran

ఆధునిక సాధనాలతో ఎదురుదాడి చేస్తాం

ప్రపంచాన్ని వినాశనం నుండి కాపాడటానికే తాను ఈ చర్యలు తీసుకుంటున్నానని, దీనికి ప్రజల మద్దతు ఉందని ట్రంప్ సమర్థించుకున్నారు. మరోవైపు ఇరాన్‌కూడా అమెరికా హెచ్చరికలపై గట్టిగానే స్పందించింది. ఇరాన్ అనుమతి లేనిదే ఆ జలమార్గాన్ని తెరవడం ప్రపంచంలో ఏ శక్తికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గనుక మళ్లీ దాడులకు తెగబడితే.. తాము సరికొత్త వ్యూహాలతో, ఆధునిక సాధనాలతో ఎదురుదాడి చేస్తామని ఇరాన్ సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అక్రమీనియా హెచ్చరించారు. టెహ్రాన్‌ (Tehran)లోని వాలియాస్ స్క్వేర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమ సైన్యం ట్రిగ్గర్‌పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని, తమ్ము ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.

Trump warns Iran: ట్రంప్, నెతన్యాహులను హతమార్చిన వారికి దాదాపు రూ.560 కోట్లు బహుమతి

ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) బహుమతిగా ఇస్తామని అధికారికంగా ప్రకటించేందుకు వీలుగా ‘ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య’ అనే బిల్లును సిద్ధం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అపాచీ హెలికాప్టర్లు, హోవిట్జర్ల కోసం $428 మిలియన్ల అమెరికా ప్యాకేజీకి ఆమోదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha