Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ దాడుల కలకలం: లెబనాన్‌లో 16 మంది మృతి

ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ దాడుల కలకలం: లెబనాన్‌లో 16 మంది మృతి

వార్త 2 weeks ago

Israel Attacks on Lebanon : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల దిశగా ఒక ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి.

దక్షిణ లెబనాన్‌ (Lebanon) లోని నబతియే జిల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు అర్ధరాత్రి భారీ ఎత్తున వైమానిక, రాకెట్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు మరికొందరు గల్లంతయ్యారు.

Read Also: Africa : ఎయిర్పోర్టుపై అల్ ఖైదా అటాక్.. 13 మంది మృతి

 Israel Attacks on Lebanon

Israel Attacks on Lebanon : వరుస వైమానిక దాడులు

నబాతియే నగరంతో పాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెబ్డైన్ వంటి సమీప పట్టణాల్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత కఫర్ టిబ్నిట్, రేహాన్ వంటి ఎత్తైన ప్రాంతాలలో కూడా వరుస వైమానిక దాడులు కొనసాగాయి. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఇదొకటని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ తాజా దాడుల ఉద్రిక్తతల కారణంగానే జెనీవాలో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఇరాన్ తదుపరి శాంతి చర్చలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాకిస్థాన్‌లోని గురుద్వారాలో సిక్కు దంపతుల హత్య..నిందితుడు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha