Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ORRపై విషాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన డీసీఎం, ఒకరు మృతి!

ORRపై విషాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన డీసీఎం, ఒకరు మృతి!

వార్త 3 weeks ago

ORR Road Accident: హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై నిలిపి ఉంచిన భారీ లారీలు వాహనదారుల పాలిట తీవ్రమైన భద్రతా ప్రమాదంగా మారుతున్నాయి.

తాజాగా ఓఆర్‌ఆర్‌పై నిలిపి ఉంచిన కంటైనర్ లారీని ఓ వాహనం బలంగా ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also : Ambenali Ghat Accident:లోయలో పడ్డ స్కార్పియో.. 8 మంది దుర్మరణం!

 Tragedy on ORR.. DCM collides with container, one dead!

ORR Road Accident: షమీర్‌పేట్ సమీపంలో అర్ధరాత్రి దారుణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర నుండి మేడ్చల్ వైపు అతివేగంగా వెళ్తున్న ఒక డీసీఎం (DCM) వాహనం, షమీర్‌పేట్ సమీపంలోకి రాగానే ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై అప్పటికే నిలిపి ఉంచిన కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. డీసీఎం వేగం ఎక్కువగా ఉండటంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ భీకర ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు ,మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే షమీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

న్యూజీలాండ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో భారతీయ ఉబెర్ డ్రైవర్ మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha