Telangana Second airport: తెలంగాణ ప్రజలకు, ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణలో రెండో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి.
చారిత్రక నగరమైన వరంగల్ లో ఈ సరికొత్త విమానాశ్రయాన్ని నిర్మించేందుకు AAI పనులను స్పీడప్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించేందుకు ఒక కన్సల్టెంట్‌ను నియమించే ప్రక్రియను కూడా AAI మొదలుపెట్టేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఈ కన్సల్టెంట్ ఆరు నెలల్లోగా అన్ని అనుమతులు తీసుకురావాల్సి ఉంటుంది.
Read Also: Bandi Sanjay Mother : బండి సంజయ్ తల్లికి గుండెపోటు
Warangal Airport with amazing features!
Telangana Second airport: అదిరిపోయే స్మార్ట్ టెర్మినల్!
ఈ సరికొత్త ఎయిర్‌పోర్ట్ ప్లాన్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఇందులో దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించబోతున్నారు. పెద్ద పెద్ద విమానాలు కూడా ఇక్కడ ఈజీగా ల్యాండ్ అవ్వడానికి, టేకాఫ్ అవ్వడానికి వీలుంటుంది. ఇక ఇక్కడ కట్టబోయే డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ సుమారు 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ సదుపాయంతో వన్-అండ్-హాఫ్ లెవెల్ స్ట్రక్చర్‌గా రూపుదిద్దుకోనుంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఒకేసారి దాదాపు 850 మంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించేలా దీని డిజైన్ సిద్ధం చేశారు.
హైదరాబాద్ రేంజ్‌లో లగ్జరీ ఫీచర్లు..
హైదరాబాద్ రేంజ్‌లో లగ్జరీ ఫీచర్లతో కొత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ సిద్ధమవుతోంది. సెల్ఫ్ చెక్-ఇన్ కియోస్క్‌లు, ఆధునిక లగేజ్ సిస్టమ్స్, బస్ లాంజ్‌లు, చైల్డ్ కేర్ రూమ్స్, స్మోకింగ్ జోన్లు, అత్యాధునిక వాష్‌రూమ్స్ వంటి సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక యాక్సెసిబిలిటీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. టాక్టైల్ ఫ్లోరింగ్, వీల్‌చైర్ ర్యాంపులతో పాటు హై-సెక్యూరిటీ కోసం ఆధునిక మెటల్ డిటెక్టర్లు, ఎక్స్-రే స్కానర్లు అందుబాటులోకి రానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

