Ramani Kalyanam Movie: సూర్య వశిష్ఠ, దీప్సిక చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా 'రమణి కల్యాణం'. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్ందిన ఈ చిత్రం మే 22వ తేదీన థియేటర్లలో విడుదలైంది.
కాగా, ఈ సినిమా జూన్ 12వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్న శారీరక లోపాలున్న ఇద్దరి మధ్య సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
Read Also : Arbaaz Khan: కోల్‌కతాలో నటుడు అర్బాజ్ ఖాన్ కారులో గుర్తుతెలియని వ్యక్తి
‘Ramani Kalyanam’ has arrived on OTT.
Ramani Kalyanam Movie: కథ
సంజన (దీప్సిక చంద్రన్) చూపులేని అమ్మాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె, బామ్మ దగ్గరే పెరుగుతుంది. అనాథలైన నలుగురు పిల్లలను దత్తత తీసుకుని వాళ్ల ఆలనా పాలనా చూస్తుంటుంది. ఒక వైపున పబ్‌లో సింగర్‌గా.. మరో వైపున ఒక ఎఫ్ఎమ్ రేడియోలో ఆర్జేగా పనిచేస్తూ, ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటుంది. అలాంటి సమయంలోనే ఆమెకు రాజ్ (సూర్య వసిష్ఠ) పరిచయమవుతాడు.
రాజ్ మంచి కవి, కానీ ఒక ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయి వీల్ ఛైర్‌కే పరిమితమవుతాడు. అనాథగా మిగిలిపోయిన రాజ్‌ను అతని స్నేహితులైన కిశోర్ – గీత (శ్రీనివాసరెడ్డి – శ్యామల) దంపతులు చూసుకుంటూ ఉంటారు. జీవితంపై ఆశలు కోల్పోయిన రాజ్‌లో, సంజన మాటలు కొత్త వెలుగును నింపుతాయి. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? అది వాళ్ల జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది? అనేదే మిగతా కథ.
సినిమా మొదటి భాగం అంతా హీరో, హీరోయిన్ల పరిచయం, వారి మధ్య ప్రేమ చిగురించడం, ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో సాఫీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే ఒక ఆసక్తికరమైన బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే, ద్వితీయార్థంలో కథను క్లైమాక్స్ దిశగా నడిపించే క్రమంలో దర్శకుడు పెట్టిన ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్‌ను కాస్త ఇబ్బంది పెడుతుంది. శారీరక లోపాలతో బాధపడే హీరో హీరోయిన్లకు తోడు, వారి తల్లిదండ్రులు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోవడం వంటి భారీ సెంటిమెంట్ సీన్లు సినిమాను మరింత బరువెక్కిస్తాయి.
నటన
హీరోగా సూర్య వసిష్ఠ, హీరోయిన్‌గా దీప్సిక చంద్రన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. లోపాలున్న వ్యక్తులుగా వారి నటన ఆకట్టుకుంటుంది. శ్రీనివాసరెడ్డి, శ్యామల నెగెటివిటీ లేని మంచి పాత్రల్లో మెప్పించారు. అరవింద్ తిరుకోవేల ఫోటోగ్రఫీ, సూరజ్ కురుప్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఓ మాదిరిగా ఉన్నాయి. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్) పూర్తిగా శూన్యం. 1980ల నాటి పాతకాలపు హెవీ సెంటిమెంట్, ఎమోషన్స్ నేటి డిజిటల్ జనరేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వడం కష్టమే. సినిమాలో వచ్చే పాటలు అంతంత మాత్రమే.
ముగింపు
‘రమణి కల్యాణం’ పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే ఒక సున్నితమైన సెంటిమెంట్ కథ. దీనిని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు వినోదానికి తలుపులు పూర్తిగా మూసేశారు. రొటీన్ ఎమోషనల్ కంటెంట్, స్లో నరేషన్ కారణంగా ఈ సినిమా నిరాశపరుస్తుంది. పాతకాలపు సెంటిమెంట్ డ్రామాలను ఇష్టపడేవారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయవచ్చు, కానీ రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి మాత్రం ఇది బోర్ కొట్టించే అవకాశముంది.
పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం!

