Maa Inti Bangaram movie: స్టార్ హీరోయిన్ సమంత సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరిసిన చిత్రం 'మా ఇంటి బంగారం'. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల విభాగంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు డిజిటల్ ప్రియుల ముందుకు రావడం విశేషం.
Samantha’s ‘Maa Inti Bangaram’ has arrived on OTT.
Maa Inti Bangaram movie: జియో హాట్‌స్టార్‌లో అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్‌స్టార్’ దక్కించుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో దక్షిణాది సినీ ప్రియులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు విశేష ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఆదరణ పొందుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
సమంత-నందిని రెడ్డిల సక్సెస్‌ఫుల్ హ్యాట్రిక్ కాంబో
ఈ యాక్షన్ కామెడీ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. గతంలో సమంతతో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఆమె, మరోసారి తనదైన శైలిలో ఈ సినిమాను రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, సమంత స్వయంగా నిర్మాతగా మారి ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
సమంత సాలిడ్ కమ్‌బ్యాక్.. నటీనటులు వీరే!
వరుస పరాజయాల తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సమంత, ‘మా ఇంటి బంగారం’తో అదిరిపోయే పునరాగమనం చేశారు. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి విడుదలైనప్పటికీ, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. సమంత పవర్‌ఫుల్ నటన, నందిని రెడ్డి టేకింగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించగా, సంతోశ్ నారాయణన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీగా జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
Epaper: epaper.vaartha.com

