Thimmarajupalli TV Movie: యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం 'తిమ్మరాజు పల్లి T.V'. వి. మునిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి అందుబాటులో ఉండగా, శుక్రవారం నుండి సాధారణ యూజర్లు అందరూ దీనిని చూడవచ్చు.
Read Also : Bandla Ganesh : బండ్ల గణేష్ వివాదంపై మరోసారి స్పందించిన పీవీపీ

Thimmarajupalli TV Movie: కథ నేపథ్యం
ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ‘తిమ్మరాజు పల్లి’ అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో పండగ సమయంలో అందరూ చందాలు వేసుకుని టీవీని అద్దెకు తెచ్చుకుని సినిమాలు చూడటం ఒక ఆచారం. ఈ క్రమంలో రాజప్ప అనే వ్యక్తి తన ఇంట్లోకి మొదటిసారిగా టీవీని కొని తెస్తాడు. ఇది ఆ ఊరి పెద్దమనిషికి నచ్చదు. అయితే, ఒకరోజు హఠాత్తుగా రాజప్ప ఇంట్లో టీవీ మాయమవుతుంది. ఆ దొంగతనం నింద హీరో సతీష్ మీద పడుతుంది. అసలు టీవీని సతీష్ దొంగిలించాడా? లేక ఊరి పెద్దమనిషి కుట్ర చేశాడా? అనేదే మిగిలిన కథ.
ఫస్టాఫ్ సాగతీత.. సెకండాఫ్ మిస్టరీ
దర్శకుడు మునిరాజ్ పల్లెటూరి వాతావరణాన్ని, మనుషుల మధ్య ఉండే ఇగోలను సహజంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కథనంలో వేగం లోపించింది. ఊరి వాతావరణం, చిన్నపాటి కామెడీ, లవ్ ట్రాక్ వంటి అంశాలతో కథ సాగుతుంది. ఇందులో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగే నేరేషన్ వల్ల ప్రేక్షకులకు కొంత బోర్ అనిపించే అవకాశం ఉంది. సెకండాఫ్‌లో టీవీ దొంగతనం చుట్టూ సాగే మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతాయి. టీవీని ఎవరు ఎత్తుకెళ్లారు అనే ఉత్కంఠను క్లైమాక్స్ వరకు దర్శకుడు బాగానే మెయింటైన్ చేశారు.
క్లైమాక్స్ ట్విస్ట్.. ప్లస్ పాయింట్స్
సినిమాకు ప్రధాన బలం క్లైమాక్స్. టీవీ దొంగ ఎవరనేది తెలిసినప్పుడు వచ్చే ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివర్లో వచ్చే ఫీల్ గుడ్ ఎమోషన్ సినిమాపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్‌ను కలిగిస్తుంది. కమర్షియల్‌గా థియేటర్లలో పెద్దగా రాణించకపోయినా, ఓటీటీ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాత కిరణ్ అబ్బవరం సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. రియలిస్టిక్ పల్లెటూరి సినిమాలు ఇష్టపడే వారికి ‘తిమ్మరాజు పల్లి T.V’ ఒక మంచి ఆప్షన్.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

