Seducer Movie: అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒక మంచి హారర్ సినిమా చూస్తూ థ్రిల్ అవ్వాలనుకునే ఓటీటీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని పరిచయం చేస్తూ గతంలో థియేటర్లలో అలరించిన ఓ బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి వచ్చేసింది.
అదే.. ‘సెడ్యూసర్’.
కొన్ని అంతర్జాతీయ ప్రాంతాల్లో ఈ సినిమాను ‘సక్యుబస్‘ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ‘సక్యుబస్’ అంటే కామ పిశాచి లేదా ఆడ దెయ్యం అనే అర్థాలు వస్తాయి. థియేటర్లలో విడుదలైన సుమారు రెండేళ్ల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
Read Also : Varanasi movie: హైదరాబాద్‌లో ఐమాక్స్ కమ్‌బ్యాక్.. ఏఎంబీ సినిమాస్‌లో వారణాసి సందడి!
Seducer Movie: OTT Streaming Telugu
కథ
ఈ సినిమా కథాంశం అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు సరదాగా గడపడానికి ఒక నిర్మానుష్య పల్లెటూరిలోకి అడుగుపెడతారు. అయితే వారు అక్కడ అనుకోకుండా ఒక ప్రాణాంతకమైన, రూపాలు మార్చే వింత కామ పిశాచి బారిన పడతారు. మనుషుల మనసుల్లో ఉండే శృంగార కోరికలను ఆసరాగా చేసుకుని ఆ కామ పిశాచి వారిని లోబర్చుకోవడం మొదలుపెడుతుంది. అంతేకాదు, ఆ వ్యక్తుల్లో ఉండే అత్యంత చీకటి కోణాలను, క్రూరమైన ఆలోచనలను అది బయటకు తీస్తుంది. శృంగార కోరికలతో రెచ్చగొట్టి మగాళ్లను తన వశం చేసుకుంటుంది ఆ కామ పిశాచి.
ఆ కామ పిశాచి మగాళ్లను వశం చేసుకున్నాక ఏం జరిగింది? ఆ రక్కసి బారి నుంచి ఆ యువకులు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అసలు ఆ నిర్మానుష్య గ్రామం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన ట్విస్టులతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అడల్ట్ అండ్ జంప్ స్కేర్స్ వంటి హారర్ సీన్లతో మేకర్స్ ఈ సినిమాను ఎంతో థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. చాలా హారర్ సినిమాలు సాగతీత లేకుండా ఉంటేనే ప్రేక్షకులకు భయం, థ్రిల్ కలుగుతాయి. ఈ విషయాన్ని దర్శకుడు బాగా గుర్తుంచుకుని సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా పాయింట్ టు పాయింట్ నడిపించారు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 1 గంట 32 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్!
సైకలాజికల్ అండ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా రాత్రిపూట అడల్ట్ కంటెంట్‌తో పాటు గగుర్పాటు కలిగించే సీన్లు చూడాలనుకునే వారికి ‘సెడ్యూసర్’ ఒక మంచి ఛాయిస్. 2024లో అంతర్జాతీయంగా తెరకెక్కిన ఈ సినిమా మే 28 నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
భారతీయ ప్రేక్షకుల కోసం జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం వంటి మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ ‘సక్యుబస్’ (సెడ్యూసర్) చిత్రాన్ని హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. హారర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వారాంతంలో దీనిపై ఒక లుక్కేయొచ్చు!
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
విజయవాడలో అట్టహాసంగా జరిగిన 'పెద్ది' ప్రీ రిలీజ్.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

