Toxic movie: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'టాక్సిక్' ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ప్రతికూల టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు ఈ చిత్రం సుమారు రూ.200 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది
Read Also: Film Awards 2026 : వేదిక మారిన ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్
Yash's 'Toxic' heads to OTT… Here's when streaming begins.
Toxic movie: ఆలస్యమైన డీల్.. సగం ధరకే దక్కిన ఓటీటీ రైట్స్
సినిమా థియేట్రికల్ విడుదలకు ముందు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రూ.150 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చినా, నిర్మాతలు అంతకంటే ఎక్కువ ఆశించి ఆ ఒప్పందాలను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే థియేటర్లలో సినిమా ప్లాప్ కావడంతో ఓటీటీ బిజినెస్ ఒక్కసారిగా పడిపోయింది. తాజా నివేదికల ప్రకారం.. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (Zee5) కేవలం రూ.30 కోట్లకు ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం
సాధారణంగా థియేటర్లలో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం పరిపాటి. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పూర్తిగా పడిపోవడంతో ఓటీటీ రిలీజ్‌ను ముందే తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారంలోనే ‘టాక్సిక్’ సినిమాను జీ5 ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

