Elections 2026: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు (ఎస్ఐర్-స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) ప్రక్రియ ప్రతిపక్షాల విజయ అవకాశాలను ఎలా దెబ్బతీసిందో ఆయన వివరిం చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతి నిథ్యం వహించిన భవానీపూర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిథ్యం వహించిన కొలత్తూర్ నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ లో ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) వల్ల సుమారు 31 లక్షల మంది ముస్లిం ఓటర్ల పేర్లు తొల గించబడ్డాయని, ఇది ఎన్నికల పలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఆరోపించారు.
Read Also:TVK Vijay : విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది
Elections 2026: Stalin, Mamata’s defeat due to vote loss: Owaisi’s sensational comments
మమతా బెనర్జీ స్వయం గా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడానికి ఇది కూడా ఒకకారణమని ఆయన విశ్లేషించారు. ఇక తమిళనా డులో కూడా ఇదేతరహాలో ఓట్లతొలిగింపు జరిగిందని, స్టాలిన్ నియోజకవర్గమైన కొలత్తూర్ కూడా ఓట్ల గల్లంతు అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చిందని అభిప్రాయ పడ్డారు. కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఓవైసీ మండిపడ్డారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పో యారని,. దీని వల్ల ఎన్నికల ఫలితాలు తారుమారయ్యా యని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఓట్ల గల్లంతుపై సరైన సమయంలో స్పందించకపవడం వల్లే ఈరోజు ఈపరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. బిజెపి విజయం వెనుక ఇటువంటి సాంకేతిక పరమైన వ్యూ హాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అన్ని సీట్లలో డిపాజిట్లు గల్లంతు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీకి బెంగాల్ ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లోనూ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అమ్ జనతా ఉన్నాయున్ పార్టీ నేత హుమయూన్ కబీర్ తో పొత్తు పెట్టుకుని, బీహార్ ఫార్ములాతో ముస్లిం ఓట్లను చీల్చాలని ఎంఐఎం ప్రయత్నించినప్పటికీ, అది బెంగాల్లో ఏమాత్రం పారలేదు. ఒక స్టింగ్ ఆపరేషన్లో హుమయూన్ కబీర్ దొరికిపోవడం ఎంఐఎం కొంపముంచింది. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే తాము ముస్లిం ఓట్లను చీలుస్తున్నామని ఆయన ఆ ఆపరేషన్లో వ్యాఖ్యానించడం మైనారిటీ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ వివాదం తర్వాత ఎంఐఎం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ, ఓటర్లు మాత్రం ఎంఐఎంను హుమాయున్ కబీర్ భాగస్వామిగానే పరిగణించి తిరస్కరించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా, బెంగాల్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఎంఐఎం ఆశలు పూర్తిగా అడియాశలయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

