Right to vote : ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితాపై ప్రజలకు నమ్మ కం లేకపోతే ఎన్నికల ఫలితాలపై కూడా అనుమా నాలు తలెత్తుతాయి. అందుకే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ వంటి ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా సాగాలి.
ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలలో ‘సర్’ ప్రక్రియ విమర్శలకు తలకెత్తుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అమలుపై వెలువడుతున్న ఆరోపణలు ఎన్నికల నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవ నెత్తుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టేయదగినవి కావు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని, బూత్ లెవల్ అధికారులపై అసాధారణ ఒత్తిడి ఉందని, రాజ కీయ ప్రభావంతో ధృవీకరణ జరుగుతోందని, ఫారాల పరిశీలన సజావుగా లేదనే ఆరోపణలున్నాయి. ఆ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందా యి. నకిలీ నమోదులు, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లను గుర్తించి జాబితా ను సరి చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ప్రకటించుకున్నా జరుగుతున్న కార్యాచరణ వేరేగా ధ్వనిస్తోంది. ప్రతి అభ్యంతరాన్ని స్వీకరించేందుకు, ప్రతి ఓటరుకి అవకాశం కల్పించేందుకు చట్టబద్ధ విధానాలు అమల్లో ఉన్నాకూడా అధికారయంత్రాంగం కొన్ని విధానాలు పట్టించుకుంటు న్నట్లు లేదు.
Right to vote
Right to vote : ప్రజాస్వామ్యానికి సరైన మార్గం
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఎంత ఎక్కువగా ఉంటే, రాజకీయ వివాదాలు అంత తక్కువగా ఉంటాయి. ప్రతి తొలగింపుకు స్పష్టమైన కారణం ఉండాలి. ప్రతి అభ్యంతరానికి వేగంగా పరిష్కారం లభించాలి. ప్రతి రాజకీయ పార్టీకి సమాన సమాచారం అందాలి. ఇదే ప్రజాస్వామ్యానికి సరైన మార్గం. ఆంధ్ర ప్రదేశ్లో ఓటరు జాబితాలపై వివాదాలు కొత్తవి కావు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కూడాఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అందువల్ల ఇది ఒక పార్టీకి సం బంధించిన అంశంగా కాకుండా, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన సమస్యగా చూడాలి. కానీ ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటే నష్టపోయేది ప్రజాస్వామ్యమే. ఎస్వీఆర్ అమలులో బూత్ లెవల్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. అధి కార యంత్రాంగం వేగం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకో వైపు రాజకీయ పార్టీలకూ బాధ్యత ఉంది. ఆధారాలతో కూడిన అభ్యంతరాలు సమర్పించడం, వాటిని నిష్పాక్షికంగా విచారించడం ఈ రెండు సమాం తరంగా జరగాలి. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా తొలగించబడకూడదు. అదే సమయంలో నకిలీ నమోదులకు కూడా స్థానం ఉండకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఎన్నికల సంఘం ముందున్న ఆసలు సవాలు. ఎస్ఐఆర్ వివాదం చివరికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీ తనం, ప్రజలతో నిరంతర సంభాషణ ఈ మూడు సూత్రాలు బలంగా అమలైతే ఆరోపణలకు తావుండదు.
జన స్వరానికి ప్రతీక
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.4 కోట్లు. తెలంగాణలో ఫ్లాగ్ చేసిన రికార్డులు సుమారు 88 లక్షలుంటాయి. సుమారు 30లక్షలు అని అధికారుల అంచనా. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 9శాతంగా చెప్పాలి. ఎమ్ఐఆర్ చెల్లుబాటైన డాక్యుమెంట్లు ఇస్తే పేరు తొలగించరాదని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసింది కూడా. వలసదారు లు, డూప్లికేట్ ఐడీల కారణంగా హైదరాబాద్లో అత్యధిక తొలగింపులు ఉండే అవకాశం ఉంది. తెలగాణలో 30 లక్షల వరకు తొలగిపోయే అవకాశం ఉందని అంచనా. ఇక ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం ఓటర్లు 4.16కోట్లు కాగా ఒక్క తిరుపతి జిల్లాలోనే 2.88 లక్షల మంది ఆచూకీ తెలియని వారి జాబితాలో పెట్టారు. ఇప్పటికే 15.2 లక్షల మంది చనిపోయిన వారు, 14.4 లక్షల మంది చిన్న గాయాలు మారిన వారు, 7.3లక్షల డూప్లికేట్ వెరసి 37లక్షలకు పైగా ఓటర్లు తొలగింపు ప్రక్రియలో బాధితులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అది జన స్వరానికి ప్రతీక. అర్హు లైన ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా తొలగించబడకూడదు. అదే సమయంలో నకిలీ నమోదులకు కూడా స్థానం ఉండకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఎన్నికల సంఘం ముందున్న అసలు సవాలు. ఎస్ఐ్వఆర్ వివా దంలో తేలిన విషయాలను బట్టి చివరికి ఒక స్పష్ట మైన సందేశాన్ని గమనించవచ్చు.
Right to vote
ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలతో నిరంతర సంభాషణ. ఈ మూడు సూత్రాలు బలంగా అమలైతే ఆరోపణలకు తావు తగ్గుతుంది. ప్రజాస్వామ్యం బల పడేది రాజకీయ విజయాలతో కాదు. ప్రజలు ఎన్నికల ప్రక్రియను నమ్మినప్పుడే. ఆ నమ్మకాన్ని కాపాడడం ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అందరి ఉమ్మడి బాధ్యత. ఓటు హక్కు అనేది ప్రజా స్వామ్య వ్యవస్థకు మూలస్తంభం. సాంకేతిక సరిదిద్దు బాట్లు లేదా అధికారిక ప్రక్షాళన పేరుతో ఏఒక్క నిజమైన పౌరుడూ ఓటు హక్కుకు దూరం కాకూడదు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత పెరగాలన్నా, ప్రజాస్వామ్య పునా దులు బలపడాలన్నా ‘నర్’ ప్రక్రియ నిష్పాక్షికంగా, పార దర్శకంగా జరగడం అత్యంత ఆవశ్యకం. తగినముందస్తు నోటీసులు లేదా క్షేత్రస్థాయి విచారణ లేకుండానే నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం క్షమార్హం కాదు. వలస కార్మికులు, పేదలు, అట్టడుగు వర్గాలు అవసరమైన ఆధార్, పుట్టిన తేదీ లేదా నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత సమయంలోగా అందించలేక ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అది ప్రజ స్వామ్యానికే తీరని మచ్చ.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
మోదీపై దూషణపూరిత పోస్ట్‌లు.. X ఖాతాలకు ఢిల్లీ పోలీసుల నోటీసు

