Palamuru University:పాలమూరు యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ, వాటిని డాక్యుమెంటరీ రూపంలో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్న నేపథ్యంలో పాలమూరు యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలోని “యోగ సంఘం పాత్ర” కార్యక్రమం కింద పాలమూరు యూనివర్సిటీకి ప్రశంసాపత్రం లభించింది. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ డాక్టర్ ఎన్. చంద్రకిరణ్ మాట్లాడుతూ ఈ ప్రశంసాపత్రం అందుకోవడంలో పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య రమేష్‌బాబు అందించిన ప్రోత్సాహం ఎంతో కీలకమైందని తెలిపారు.
Read also: School holidays: అలర్ట్.. రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు హాలిడే!
Palamuru University:హర్షం వ్యక్తం చేసిన యూనివర్సిటీ వర్గాలు
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వాల్లో యోగా ఒకటని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీకి ఈ అరుదైన గుర్తింపు లభించిన సందర్భంగా అధ్యాపకులు, అధికారులు, ఉద్యోగులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Epaper: epaper.vaartha.com

