Dailyhunt
పాట్ కమిన్స్‌పై ఇషాన్ కిషన్ ప్రశంసలు

పాట్ కమిన్స్‌పై ఇషాన్ కిషన్ ప్రశంసలు

వార్త 1 week ago

Ishan Kishan: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతోంది. ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలినా, ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరింది.

Read Also:Abhishek Sharma Viral Video:అభిషేక్ శర్మ చేయి పట్టుకుని లాగిన యువతి: వైరల్ వీడియో!

Ishan Kishan: ఇషాన్ కిషన్ నాయకత్వంలో సరికొత్త ‘రైజ్’

రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్, జట్టు దశను మార్చేశారు.సీనియర్ బౌలర్లు విఫలమవుతున్న వేళ, యువ ఫాస్ట్ బౌలర్లపై నమ్మకముంచి వారికి అవకాశం ఇవ్వడం జట్టుకు కలిసివచ్చింది.”కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది. కానీ పాట్ కమిన్స్ అద్భుతమైన నాయకుడు. ఇప్పుడు మళ్ళీ నా దృష్టిని బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పెడతాను” అని ఇషాన్ పేర్కొన్నారు.

ప్యాట్ కమిన్స్ జట్టులోకి రావడంతో బౌలింగ్ బలం పెరగడమే కాకుండా.. నాయకత్వ అనుభవం జట్టుకు ఎంతో ప్లస్ అయిందని చెప్పాడు. గత ఏడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయడం బాగున్నప్పటికీ.. కమిన్స్ రాకతో తాను ఇప్పుడు కేవలం బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలుగుతున్నానని తెలిపాడు.అలాగే భయపడకుండా షాట్లు ఆడాలని, పవర్‌ప్లేలో మంచి ప్రారంభం ఎంతో కీలకమని తెలిపారు. అభిషేక్ శర్మ కూడా ఈ మధ్య అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో SRH విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరి ఫామ్ SRH జట్టుకు పెద్ద ప్లస్‌గా మారింది.నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో, ప్లేఆఫ్స్ రేసులో బలమైన జట్టుగా అవతరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఐపీఎల్ పరుగుల వరద.. బౌండరీల దూరం పెంచాల్సిందేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha