Band Melam Review: రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. 'ఈ సినిమా బాలేకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు' అని నాని తరహాలో ఛాలెంజ్ చేశారు.
కానీ, ఆ నమ్మకం థియేటర్లో ఎంతవరకు ఫలించింది? పాత చింతకాయ పచ్చడి లాంటి కథనే మళ్లీ వడ్డించిన ఈ చిత్రంపై విశ్లేషణను ఒకసారి చూద్దాం.
Read Also:Valmiki Ramayan first look: 'వాల్మీకి రామాయణం' ఫస్ట్ లుక్ విడుదల
Band Melam Review: కథా నేపథ్యం
గిరి అలియాస్ యాదగిరి (హర్ష్ రోషన్), రాజమ్మ అలియాస్ రాజీ (శ్రీదేవి) బావా మరదళ్లు. చిన్నప్పటి నుంచే ఒకరి కోసం ఒకరు అన్నట్టు పెరుగుతారు. అయితే గిరి తండ్రి సుందరయ్య (గోపరాజు విజయ్) దానాలతో ఆస్తి పోగొట్టుకోగా, ఆయన సాయంతో ఎదిగిన సాయన్న (సాయికుమార్) పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. ఆస్తి పెరిగేసరికి సాయన్నకు అహంకారం పెరిగి, తన బావ కుటుంబాన్ని దూరం పెడతాడు. తన కూతురు రాజీని గిరికి ఇవ్వనని భీష్మిస్తాడు. మరి, గిరి తన మరదలిని ఎలా దక్కించుకున్నాడు? పెద్దల మనసు ఎలా మార్చాడు? అన్నదే మిగతా కథ.
Band Melam Movie Review Telugu
విశ్లేషణ
కథ క్యారెక్టర్లను డిమాండ్ చేయాలి తప్పితే.. క్యారెక్టర్ల కోసం కథ అనుకుంటే అది బ్యాండ్‌మేళం అవుతుంది. కోర్ట్ క్రేజ్‌తో హర్ష్ రోషన్, శ్రీదేవిలను ఈ బ్యాండ్‌మేళంకి హీరో హీరోయిన్లను ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ.. కథ ఒక దశ వరకూ వాళ్లని హీరో హీరోయిన్లుగా యాక్సెప్ట్ చేయవచ్చు కానీ.. ఎప్పుడైతే కథ టీనేజ్ నుంచి మ్యారేజ్ వైపు మళ్లిందో అప్పటి నుంచి ఈ నిబ్బా నిబ్బీలను హీరో హీరోయిన్లుగా పెట్టారేంటి? అనిపిస్తుంది. ఎంత అసహజంగా అనిపిస్తుందంటే.. హీరోయిన్‌ని పెళ్లి కూతుర్ని చేస్తుంటే.. అది పెళ్లి వేడుకలా కనిపించదు.. పెద్ద మనిషి ఫంక్షన్‌లా అనిపిస్తుంది. ఇక హీరోకి పెళ్లి కొడుకు గెటప్ వేసినా.. బాల్య వివాహం మాదిరే కనిపిస్తాడు తప్పితే తన పరిధికి వయసుకి తగ్గ పాత్రగా కనిపించదు.బేబీ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించి.. ప్రేమికుల నాడి పట్టే మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన విజయ్ బుల్గానిన్ ఉన్నంతలో మ్యూజిక్ బాగానే అందించారు.
తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ట్యూన్స్, మాస్ బీట్స్, రీమిక్స్ పాటలు ఆకట్టుకున్నాయి. 'తిప్పుకుంటున్నావ్' సాంగ్ థియేటర్స్‌లో దద్దరిల్లింది. వినడానికే కాదు.. విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చింది. అయితే మ్యూజిక్‌తో సీన్‌లను ఎలివేట్ చేసేటంత బలమైన, భావోద్వేగమైన సీన్లు ఇందులో లేకపోవడంతో విజయ్ బుల్గానిన్‌కి పెద్దగా పని పడలేదేమో అనిపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బావుంది. ఎక్కువ శాతం ఔడ్ డోర్ షూట్ ఉండటంతో చాలా సీన్లలో సహజత్వం కనిపించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

