Old Pension : ఒక్కరైతే ఒంటరే… ఒక్కటైతే ఉప్పెనే' అనే నినాదంతో, లక్షలాది సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యా యుల సామాజిక భద్రతే ధ్యేయంగా జనం నుండి ఉద్భవించిన మహా ప్రవాహం.
తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూని యన్ (టిఎస్సిపిఎస్ఈయు). 2016 లో ప్రారంభమైన ఈ సంఘం, సిపిఎస్ విధానం పట్ల ఉద్యోగుల్లో ఉన్న అంధకారాన్ని తొలగించి, వారిలో అవగాహన కల్పించేందుకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో విస్తృతంగా నదస్సులు, సమావేశాలను నిర్వహించింది. నాటి నుండి నేటి వరకు రాజీలేని పోరా టాలతో పాత పెన్షన్ (ఓపిఎస్) సాధనకై ఈ యూనియన్ దేశవ్యాప్త ఉద్యమానికి ఇరుసుగా నిలిచి ఉద్యోగ, ఉపాధ్యా యులకు 2016వరకు లేని 16 లక్షల విలువక్ డెత్ కామ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీతోపాటు ఉద్యోగి సర్వీస్లో ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ఆర్థిక రక్షణను కల్పించాయి. ఇది కేవలం 10 ఏళ్లలోనే సాధించింది. అనేక శక్తి యుక్తులతో, అనంతమైన మేధోశక్తితో, కఠినమైనపోటీని తట్టుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల భవితను పిఎస్ఆర్డీఏ అనే చట్టం ద్వారా ప్రవేశ పెట్టిన నూతన పెన్షన్ విధానం అంధకారమయం చేసింది.
Old Pension
Old Pension : ఉద్యోగి జీతం నుండి కట్ చేసిన సొమ్ము
మార్కెట్ ఒడిదొడుకులపై పెన్షన్ ఆధారపడటం పాత పెన్షన్ విధానంలో (ఓపిఎస్) ఉద్యోగి రిటైర్ అయ్యేనాటికి వచ్చిన చివరి జీతంలో సగం మొత్తాన్ని పెన్షన్గా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేది. కానీ సిపిఎస్ విధానంలో ఉద్యోగి జీతం నుండి కట్ చేసిన సొమ్మును షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల వల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ కేవలం కొన్ని వందల రూ పాయలకే పరిమితం అవుతోంది. జీవన భృతికి చాలని పెన్షన్లు: ముప్పై, నలభై ఏళ్లు ప్రభుత్వానికి సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులకు నేడు నెలకు రూ. 1000 నుండి రూ. 2000 లోపే పెన్షన్ వస్తున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఈ కాలంలో ఈ అరకొర డబ్బులతో ఒక వృద్ధాప్య కుటుంబం కనీసం మందుల ఖర్చులు కూడా వెళ్లదీసుకోలేని దుస్థితి నెలకొంది. ఆత్మగౌరవానికి దెబ్బ: జీవితాంతం గౌరవప్రదమైన హోదాలో బతికిన ఉద్యోగి, రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై లేదంటే ఇతరులపై ఆధారపడాల్సి రావడం వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. సామాజిక భద్రత కరువై, విశ్రాంత జీవితం నిస్సహాయంగా మారుతోంది. ఈ అన్యాయమైన విధానానికి వ్యతిరేకంగా టిఎస్సిపిఎస్ యు నేతృత్వంలో సాగినఉద్యమ ప్రస్థానంలో ఎన్నో మైలురా ళ్ళు ఉన్నాయి. శంఖారావం (ఫిబ్రవరి 26, 2017): నిజాం కాలేజ్ మైదానంలో లక్షలాది మందితో నిర్వహించిన ఈ సభ రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపింది. దీని ఫలితంగానే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ (జి.ఓ 60)సాధించబడింది, సామూహిక సెలవు, ధర్మదీక్ష (సెప్టెంబర్ 1, 2017) సంఘం ఇచ్చిన పిలుపుతో 85 పైగా ఉద్యోగ, ఉపాధ్యాయు లు సామూహిక సెలవు పెట్టి, జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు చేపట్టి తమ దృఢ సంకల్పాన్ని చాటారు. ఆయుత ధర్మదీక్ష (జనవరి 7, 2018): నాటి ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ గడ్డపై వేలాది మందితో ఆయుత ధర్మదీక్షను విజయవంతంగా నిర్వహించారు.
Old Pension
సిపిఎస్ రద్దు
ఆత్మగౌరవ జన జాతర, ఓట్ ఫర్ ఓపిఎస్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో లక్షకు పైగా కుటుంబాలతో భారీ బహిరంగ సభ నిర్వహించి, “పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే మా ఓటు” అని ప్రతిజ్ఞ చేసి సిపిఎస్ ఐక్యతను చాటారు. రాజకీయ నిర్ణయం మేనిఫెస్టోలో హామీ: దేశవ్యాప్తంగా ఎన్.ఎం.ఓ.పి.యస్ ద్వారా ఉద్యమాన్ని విస్తరింపజేసి ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణకు కారణమైంది సిపీఎస్ యూనియన్. తెలంగాణలో సైతం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను కలిసి సమస్య తీవ్రతను వివరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో “సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ” హామీని చేర్చేలా ఈ యూని యన్ నేతలు క్రియాశీలక కృషి చేశారు. గతంలో ఇచ్చిన హామీలు, సిపిఎస్ పెన్షన్ లోపాలవల్ల ఉద్యోగులు ఎదు ర్కొంటున్న తీవ్ర అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి మరోమారు బలంగా గుర్తుచేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలనే ఏకైక డిమాండ్తో టిఎసి సిపి ఎస్ఈయు మరో చారిత్రాత్మక ఉద్యమానికి శ్రీకారం చుడు తోంది. జులై 11 నుండి జన జాగరణ యాత్ర: ఈ సుదీర్ఘ పోరాట యాత్ర భద్రాద్రి జిల్లా నుండి ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ ఏకం చేస్తూ ఈ యాత్ర సాగుతుంది. నియోజకవర్గ కేంద్రాల్లో సిపిఎస్ఎఉద్యో గులతో ప్రత్యేక అవగాహన, సమరశీల సమావేశాలు నిర్వ హించి, ఆయా ప్రాంతాల స్థానిక శాసనసభ్యులను (ఎమ్మె ల్యేలను) ప్రత్యక్షంగా కలిసి ఎమ్మెల్యేల స్పందన కోరను న్నారు. ‘నాడు ఓట్లు వేశాం.. నేడు మా పెన్షన్ సమస్యపై మీ స్పందన ఏంటి?’ అని ప్రశ్నిస్తూ, నాటి ఎన్నికల మేని ఫెస్టో హామీని తక్షణమే జీవో రూపంలో అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. ఆగస్టు 23చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ: జన జ లాగరణ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో మలిదశ చైతన్యంతో ఆగస్టు 23న హైదరాబాద్ నడిబొడ్డున చలో హైదరాబాద్ పేరిట 2.6లక్షలాదిమందితో భారీ బహి రంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా సిపిఎస్ విధానంవల్ల రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నవేదనను, సమస్య తీవ్రతను ప్రభుత్వానికి కళ్లకుకట్టేలా వివరించి, పాత పెన్షన్ జీవోసాధన దిశగా అంతిమపోరాటం చేయనున్నారు.
-గంగాపురం స్థితప్రజ్ఞ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
పాడైపోయిన ఆహారాన్ని సరఫరా చేశారన్న ఆరోపణలపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసు

