Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

వార్త 2 weeks ago

Telangana Liberation Day: తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని చారిత్రాత్మక పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ పూజలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

 Revanth Reddy hoisted the national flag at Public Gardens.

Telangana Liberation Day: స్వేచ్ఛ, సామాజిక న్యాయమే పునాదిగా పారదర్శక పాలన: సీఎం రేవంత్ రెడ్డి

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, స్వేచ్ఛ, సామాజిక న్యాయమే పునాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన 'ప్రజా పాలన'ను అందిస్తోందని స్పష్టం చేశారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha