VC Sajjanar Advice to Students: హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ పదవ తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అత్యంత విలువైన సందేశాన్ని ఇచ్చారు.
మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని ఆయన హితవు పలికారు.
Read Also:KTRను ఆ ఇద్దరు భామలు బాగా గుర్తుపెట్టుకుంటారు - చామల
VC Sajjanar Advice to Students: మార్కులు జీవితాన్ని నిర్ణయించవు
పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్న తరుణంలో కొందరు విద్యార్థులు నిరాశకు గురవుతుండటంపై సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు.వైఫల్యం అనేది విజయానికి మొదటి మెట్టు కావాలి తప్ప, అది జీవితానికే ముగింపు (End of life) కాకూడదు.తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామని ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే, మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు కలిసి ఈ ఫలితాలను వెల్లడిస్తారు. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా.. సబ్జెక్టుల వారీగా విద్యార్థులు సాధించిన మార్కులను కూడా పొందుపరుస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

