Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవి పోయిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు భద్రత తొలగింపు!

పదవి పోయిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు భద్రత తొలగింపు!

వార్త 2 months ago

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా, కు పంజాబ్ ప్రభుత్వం,పార్టీ నాయకత్వం నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించిన కొద్దిరోజులకే, ఇప్పుడు ఆయన భద్రతను కూడా కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Read Also:MK Stalin : డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Raghav Chadha: ఎందుకీ గందరగోళం? పార్టీ ఆరోపణలు ఏమిటి?

ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన రాఘవ్ చద్దాకు సొంత ప్రభుత్వం నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజ్యసభలో ఆప్ డెప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను ఏప్రిల్ 2వ తేదీన తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఉన్న Z+ కేటగిరీ భద్రతను కూడా రద్దు చేస్తూ పంజాబ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.37 ఏళ్ల వయసున్న చద్దా రక్షణ కోసం ఇప్పటివరకు పనిచేస్తున్న పంజాబ్ పోలీసు అధికారులను, సిబ్బందిని వెంటనే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

 Raghav Chadha Security Withdrawal

ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దాకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి చద్దా వెనకాడుతున్నారని పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ‘సాఫ్ట్ పీఆర్’ పనులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఏప్రిల్ 2వ తేదీన ఆయన్ని రాజ్యసభ డెప్యూటీ లీడర్ పదవి నుంచి పార్టీ తొలగించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంపై ఈడీ దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha