Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదేళ్లలో రాష్ట్రం ఆగం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పదేళ్లలో రాష్ట్రం ఆగం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

వార్త 2 days ago

TG Politics: భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌తో తెలంగాణ యువత భవిష్యత్తు మారబోతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు కొత్త తరహా మహానగరం రూపుదిద్దుకుంటోందన్నారు. ముంబై-నవీ ముంబై, నోయిడా, గురుగ్రామ్ స్థాయిలో ఆధునిక నగర నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలకు అవకాశాలు కల్పించే దిశగా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

Read also: Cockroach Janata Party: నిద్రలేని రాత్రులు గడుపుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడి తల్లిదండ్రులు!

ఫ్యూచర్ సిటీలో 12 ప్రత్యేక జోన్లు

ఫ్యూచర్ సిటీలో ఏఐ, డిజిటల్ సర్వీసెస్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన 13,500 ఎకరాలకు తోడు మరో 30 వేల ఎకరాల్లో విస్తరణ చేపడుతున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో పాటు జిల్లాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

TG Politics: హరీష్ రావుపై యెన్నం తీవ్ర విమర్శలు

హరీష్ రావు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారులను భయపెట్టి రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టులకు మంచి స్పందన వస్తోందని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha