Telangana weather:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినప్పటికి వాతావరణంలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి, మరికొన్ని జిల్లాల్లో కనిస తొలకరి జల్లులు కూడా పడటం లేదు.
ఓ వైపు వర్షాలు పడి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే, మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఒకవైపు మధ్యాహ్నం ఉక్కపోతతో కూడిన ఎండలు, మరోవైపు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు పైబడి ఉంటుండగా, అరగంటలోనే భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం పగటి పూట సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత, అధిక తేమ కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే సాయంత్రం వేళల్లో ఆకస్మికంగా వాతావరణం మారి గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాలలో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
Read also: 2027 Weathe Alert: 2027లో రికార్డు స్థాయి ఎండలు
Telangana weather conditions
కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే రోడ్లు జలమయమయ్యే స్థాయిలో కుండపోత వర్షం కురుస్తుంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.3 డిగ్రీలు, భద్రాచలంలో 34.6 డిగ్రీలు, హకీంపేట్లో 36.4 డిగ్రీలు, దుండిగల్లో 34.2 డిగ్రీలు, హన్మకొండలో 39 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీలు, ఖమ్మంలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్లో 32.7 డిగ్రీలు, మెదక్లో 36.2 డిగ్రీలు, నల్లగొండలో 38 డిగ్రీలు, నిజామాబాద్లో 39.5 డిగ్రీలు, రామగుండంలో 40.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి వర్షాలు పడ్డాయి. గడచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్లో 53.4 మిల్లీ మీటర్లు, మంచిర్యాల జిల్లా మందలమర్రిలో 38.2 మిల్లీ మీటర్లు, జిల్లా కేంద్రం మహబూబ్నగర్లో 29.8 మిల్లీ మీటర్లు, ఇదే జిల్లా జడ్చర్లలో 25.4 మిల్లీ మీటర్లు, భూధ్పూర్లో 23 మిల్లీ మీటర్లు, వికారాబాద్ జిల్లా దోమలో 16.6 మిల్లీ మీటర్లు, బూమ్రాస్పేట్లో లో 16.2 మిల్లీ మీటర్లు, నిర్మల్ జిల్లా సారంగపూర్లో 28.2 మిల్లీ మీటర్లు, భూపాలపల్లి జిల్లా భూపల్పల్లెలో 13.6 మిల్లీ మీటర్లు, సిద్దిపేట్ జిల్లా జగ్దేవ్్పూర్లో 13.2 మిల్లీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా నందిపేట్లో 13 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.
Telangana weather:తెలంగాణలో విచిత్ర వాతావరణం
కాగా వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయని తెలిపింది. రుతుపవనాలు ఉత్తర పరిమితి హర్నై, షోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫూల్బాని, రాంచీ, జముయి, ముజఫర్పూర్ గుండా వెళుతోందని పేర్కొంది. రాబోయే 4-5 రోజులలో నైరుతి రుతుపవనాలు మధ్య ఆరేబియా సముద్రం, మహారాష్ట్రలలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ మరియు బీహార్లలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలియచేసింది. ఇక సాయంత్రం వరకు తెలంగాణలో ఎండలు తీవ్రత అధికంగా ఉంటుందని, సాయంత్రం తర్వాత వాతావరణం మారుతుందని తెలిపింది. రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, నల్లగొండ, నారాయణ్్పట్, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షంతో పాటు, గరిష్ట ఉపరిత గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల వరకూ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Epaper: epaper.vaartha.com

