Captain Smith Matcher: దుబాయ్ నుంచి 170 మందికి పైగా ప్రయాణికులతో టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
విమానం సుమారు 34,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో, సహ పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని నేలకూల్చేందుకు కుట్ర పన్నాడు. ఈ ప్రమాదకర చర్యను గమనించిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కత్తితో దాడి.. వేగంగా కిందకి పడిపోయిన విమానం
కెప్టెన్ అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కో పైలట్, ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విమానం తన నియంత్రణను కోల్పోయి, నిమిషానికి దాదాపు 23,000 అడుగుల వేగంతో కిందకి దూసుకెళ్తూ 15,600 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అయినప్పటికీ ధైర్యం వీడని కెప్టెన్ స్మిత్, తీవ్ర గాయాలతోనే ప్రయాణికుల సాయంతో కో పైలట్‌ను నిలువరించి విమానాన్ని సురక్షితంగా అదుపులోకి తెచ్చారు.
Captain Smith Matcher: ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు: “భారత్ గర్విస్తోంది”
ఈ సాహసోపేత ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అసలైన హీరోగా అభివర్ణించారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయకర పరిస్థితుల్లోనూ ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలు వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయని, తద్వారా ఒక పెను విషాదం తప్పిందని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
అనుభవజ్ఞుడైన పైలట్ కెప్టెన్ స్మిత్ నేపథ్యం
భారతదేశానికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. గత నాలుగేళ్లుగా ఎమిరాటీ ప్రభుత్వానికి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థలో ఆయన సేవలందిస్తున్నారు. అంతకుముందు పదేళ్ల పాటు ప్రముఖ భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో కూడా పనిచేశారు. బోయింగ్ 737 విమానాలను నడపడంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, ఇప్పటివరకు సుమారు 9,750 గంటలకు పైగా విమానాలను సురక్షితంగా నడిపిన లైన్ ట్రైనింగ్ కెప్టెన్.
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమొక్రసీ మార్చ్'.. ఇండియా కూటమి కీలక నిర్ణయం

