–లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు–సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - గ్రామ సమస్యలపై ప్రజాదర్బార్
NTR Bharosa Pensions: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించబడింది.
శెట్టూరు మండలం యరబోరెపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామస్థులు, టీడీపీ నాయకులు పూలవర్షం కురిపించి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత పింఛన్ల పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. అదే సంక్షేమ దృక్పథాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అందిస్తు న్నారని తెలిపారు.కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తం 36,504 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఈ నెల రూ.16.07 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక సంక్షేమ పండుగలా మారిందని, దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయడం వల్ల లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు.
NTR’s social security pensions distributed in festive atmosphere
NTR Bharosa Pensions: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి:-
పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామస్తుల నుంచి పలుసమస్యలకు సంబంధించిన వినతిపత్రా లను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా పేదలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సహాయనిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.+ఈ సందర్భంగా సీఎం సహాయనిధి ద్వారా 11 మంది బాధితులకు రూ.12.42 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గత పాలకులపై విమర్శలు
అభివృద్ధి అంశాలపై మాట్లాడిన ఎమ్మెల్యే సురేంద్రబాబు, గత ఐదేళ్లలో కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎంపీ రంగయ్య గ్రామాల అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టలేదని, బీటీపీ కాలువ పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.
అభివృద్ధే లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రహదారులు, సీసీ రోడ్లు, తాగునీటి వసతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
యరబోరెపల్లి గ్రామంలో ఇటీవల తాగునీటి సమస్యపై గ్రామస్తులు దృష్టికి తీసుకురాగానే వెంటనే రెండు బోర్లు తవ్వించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు అధికారులతో మాట్లాడ తామని, మర్రిస్వామి కొండకు రహదారి నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సిబ్బందిని పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశ్లేషణ
ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకంగా కాకుండా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని పెంపొందించే వేదికగా వినియోగిస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. పింఛన్ల పంపిణీతో పాటు ప్రజాదర్బార్ నిర్వహిం చడం, సీఎం సహాయనిధి చెక్కుల పంపి ణీ, గ్రామ సమస్యలపై హామీలు ఇవ్వడం ద్వారా సంక్షేమం -అభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసే ప్రయ త్నం కనిపించింది. నియోజకవర్గ అభి వృద్ధిపై ఎమ్మెల్యే చేసిన హామీలు ఎంత మేరకు కార్యరూపం దాల్చుతా యన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

