Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య.. అసలేం జరిగింది?

పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య.. అసలేం జరిగింది?

వార్త 4 days ago

Inder Kaur Murder Case: పంజాబీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ గాయని ఇందర్ కౌర్ (యశిందర్ కౌర్) విషాదాంతమయ్యారు. కొన్ని రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఆమె, సోమవారం నాడు లుథియానా సమీపంలోని నీలోన్ కాలువలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

లుథియానా పరిధిలోని జమాల్‌పూర్ నివాసి అయిన ఇందర్ కౌర్, ఈ నెల 13వ తేదీ రాత్రి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం బయటకు వెళ్లారు. అయితే, రాత్రి ఎంతైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తొలుత కాలువ పరిసరాల్లో ఆమె కారు లభ్యమవగా, ఆ తర్వాత కాలువలోనే ఆమె మృతదేహం వెలికితీశారు.

Read Also :Twisha Sharma case: సంచలనం సృష్టింటించిన ట్విషా కేసు .. పోలీసులు ఏమన్నారంటే ?

లవ్ రిజెక్షన్ వల్లే దారుణం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలు

 Police investigation near Neelon canal in Ludhiana following the recovery of Punjabi singer Yashinder Kaur’s body

ఇందర్ కౌర్ మృతి వెనుక సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కుటుంబ సభ్యులు గట్టిగా ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా అతను ఇందర్ కౌర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడని, అయితే అందుకు ఆమె నిరాకరించిందని వారు తెలిపారు. పంజాబ్‌లోని మోగాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ కెనడాలో నివసిస్తుంటాడని, ఇటీవలే నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చాడని సమాచారం. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో సుఖ్వీందర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి, ఇందర్ కౌర్‌ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడని.. ఆపై దారుణంగా హత్య చేసి కాలువలో పడేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Inder Kaur Murder Case: నిందితుల కోసం పోలీసుల వేట.. విదేశాలకు పరార్?

ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం ప్రధాన నిందితుడు సుఖ్వీందర్ సింగ్ మళ్లీ నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి సహకరించిన ఇద్దరు స్థానిక నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వివాహితను వేధించిన యువకుడికి గ్రామస్థుల వినూత్న శిక్ష!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha