Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంట కొనుగోలు చేయకుంటే రాజీవ్ రహదారి దిగ్బంధం

పంట కొనుగోలు చేయకుంటే రాజీవ్ రహదారి దిగ్బంధం

వార్త 2 months ago

BRS Farmer Protest:

  • కాంగ్రేస్ ప్రభుత్వం తక్షణమే పొద్దు తిరుగుడు మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తాం!
  • రైతులకు శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
  • పొద్దు తిరుగుడు మక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
  • కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు!
  • రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి నెలల తరబడి ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదు!
  • పొద్దు తిరుగుడు మొక్కజొన్నల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి!

Read also: BJP vs Congress: ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

BRS Farmer Protest: రైతులు పండించిన పొద్దు తిరుగుడు మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ లు అన్నారు.
బుధవారం రోజు చిన్నకోడూరు మండల కేంద్రంలో చేపట్టిన రైతు మహాధర్నలో పాల్గొని మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో నమ్మబలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టగానే రైతుల గురించి ఆలోచన చేయడం లేదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు రైతు డిక్లరేషన్ పేరుతో సభలు నిర్వహించి మోసపూరిత డిక్లరేషన్ చేసి ప్రభుత్వం రాగానే వాగ్దానాలను విస్మరించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులకు రేవంత్ రెడ్డి గురి చేస్తున్నాడని బి ఆర్ ఎస్ ప్రభుత్వం లోని కెసిఆర్ హరీష్ రావుల ఆధ్వర్యంలో రైతు శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తూ రైతులకు కరువు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు సాగునీరు అందించి లక్షల ఎకరాలలో పండిన పంట ధాన్యాలను సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక ఎత్తు మిగలకుండా పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత కేసిఆర్ హరీష్ రావులకే దక్కుతుందని అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా విమర్శలు చేస్తూ పూట గడుపుతున్నాడు తప్పితే రైతుల కోసం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం ఏమాత్రం ఆలోచన చేయడం లేదని కేవలం ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ప్రజా మీటింగ్ లు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీని విమర్శించుకుంటూ కాలం గడుపుతున్నాడని మండిపడ్డారు.

90 రోజుల ప్రజా పాలన పేరుతో గ్రామాలకు ఒరిగింది కూడా ఏమీ లేదని ప్రజా పాలన సమావేశాలకు మంత్రులు కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదని రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే గ్రామాలలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ప్రజలకు ఏం చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లో మార్కెట్కు వచ్చిన పొద్దు తిరుగుడు మొక్కజొన్నల ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, కీసరి పాపయ్య, ములకల కనకరాజు, కొండం రవీందర్ రెడ్డి, సర్పంచులు కాసం రాజిరెడ్డి, ములకల కుంటయ్య, యాట సత్యలక్ష్మి-యాదయ్య, కూర మధుసూదన్ రెడ్డి, గుండెల్లి వేణు, సిద్ధులు రాజు, చెరుకు కవిత-సంతోష్, స్వామి, పర్షారములు, మోసర్ల మధుసూదన్ రెడ్డి, రేగుల శామల-దేవయ్య, నముండ్ల సరిత-హరీష్, నాయకులు ఏలేటి రాజారెడ్డి, పిన్నింటి అభిరెడ్డి, కాల్వ ఏల్లయ్య, సుంచ్చు ఏల్లయ్య, ముత్తయ్య, లచయ్య, శ్రవణ్, సాదిక్, రెడ్డి రాజి రెడ్డి, నునుగొప్పుల బాలయ్య, రాజశేఖర్ రెడ్డి, ఆనంద్, అనిల్, భాను తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

కేసీఆర్ కొత్త వ్యూహం.. గులాబీ పార్టీలో భారీ మార్పులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha