Cabinet Meeting:రబీ సీజన్ 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటల కనిష్ట మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా గోధుమలు పప్పుధాన్యాలు ఆవాలు బార్లీ కుసుమ వంటి పంటల ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ తాజా పెంపు ద్వారా రైతులు సాగు చేసే ప్రధాన పంటలకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర దక్కనుంది.
Read also: No UPI Day: అక్టోబర్ 2న 'నో యూపిఐ డే'.. దేశవ్యాప్తంగా UPI బంద్ అవుతుందా?
Centre hikes crop support prices.
గోధుమ పంటకు పెరిగిన రేటు
వివిధ రబీ పంటల ధరల పెంపు వివరాలు పరిశీలిస్తే కుసుమ క్వింటాల్‌కు 675 రూపాయలు ఆవాలు రాప్‌సీడ్ 413 రూపాయలు మసూర్ పప్పు 390 రూపాయలు బార్లీ 136 రూపాయలు శనగ 83 రూపాయలు గోధుమ 25 రూపాయలు చొప్పున పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వల్ల రైతుల ఆదాయం మెరుగవుతుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉత్సాహం పెరుగుతుంది.
Cabinet Meeting:శనగలు ఎర్రపప్పు రేట్లు సవరణ
ధరల సవరణ అనంతరం దేశవ్యాప్తంగా రబీ పంటల కొత్త మద్దతు ధరలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం గోధుమ ధర 2610 రూపాయలకు శనగ ధర 5958 రూపాయలకు మసూర్ పప్పు 7390 రూపాయలకు ఆవాలు 6613 రూపాయలకు కుసుమ 7215 రూపాయలకు బార్లీ 2286 రూపాయలకు చేరాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అన్నదాతలకు నేరుగా మేలు జరుగుతుంది.
Epaper: epaper.vaartha.com
నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. NCMC వినియోగదారుల కోసం NCRTC కొత్త ట్రిప్ పాస్

