Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరీక్షల అక్రమాలపై ఉద్యమం..విద్యా మేనిఫెస్టోను ప్రకటించనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ

పరీక్షల అక్రమాలపై ఉద్యమం..విద్యా మేనిఫెస్టోను ప్రకటించనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ

వార్త 3 days ago

Cockroach janata party: పోటీ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి తెరలేచింది.

సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. పుణేలోని సావిత్రిభాయి ఫూలే యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం శాంతియుత నిరసనతో ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ప్రత్యేక 'విద్యా మేనిఫెస్టో'ను కూడా విడుదల చేయనున్నారు.

 Paper Leak Nationwide Movement

Read also: Abhishek Banerjee: సంతకాల ఫోర్జరీ కేసు.. ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి భారీ ఊరట

విద్యా వ్యవస్థలో సంస్కరణలే లక్ష్యం.. మేనిఫెస్టోలో కీలక అంశాలు

పూర్తిగా రాజ్యాంగ పరిధిలోనే, అహింసా మార్గంలో ఈ నిరసనలు కొనసాగుతాయని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో పలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు ఆయన వివరించారు:

  • పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం.
  • పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకురావడం.
  • పరీక్ష ఫలితాలను ముందే ప్రకటించిన గడువులోగా విడుదల చేయడం.
  • పరీక్షలు నిర్వహించే బోర్డులు, సంస్థల జవాబుదారీతనాన్ని పెంచడం.
  • పరీక్షల జాప్యం వల్ల అభ్యర్థులు మానసికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడం.

Cockroach janata party: పుణే టు ఢిల్లీ: జూన్ 20న జంతర్‌మంతర్ వద్ద భారీ ఆందోళన

పుణే వేదికగా ప్రారంభమయ్యే ఈ యువజన ఉద్యమం దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరించనుంది. జైపూర్, లక్నో, అమృత్‌సర్, బెంగళూరు నగరాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు దీప్కే ప్రకటించారు.

కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే!

విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాల వల్ల దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని దీప్కే ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంతవరకు ఈ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు. తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ సమస్యలను ఆలకించేందుకు బదులుగా ప్రభుత్వం తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. యువత ఆవేదనను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

ఓపెన్‌డోర్ కార్యకలాపాలు మూసివేత.. 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha