Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP: నీట్ వివాదంపై దేశవ్యాప్త నిరసనలు

'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP: నీట్ వివాదంపై దేశవ్యాప్త నిరసనలు

వార్త 2 days ago

CJP announces 'Exam Manifesto' : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థి లోకం, రాజకీయ వర్గాలు భగ్గుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులు, సీజేపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విద్యార్థుల హక్కుల రక్షణ కోసం ఒక చారిత్రాత్మక ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదల చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎండగడుతూ, విద్యార్థులకు భరోసా కల్పించేలా అందులో పలు కీలక డిమాండ్లను పొందుపరిచారు.

Read Also: Indian crew ship attack: ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి!

 CJP announces ‘Exam Manifesto’

మేనిఫెస్టోలోని ముఖ్యమైన డిమాండ్లు ఇవే:

  • రూ. 10,000 నష్టపరిహారం: ఒకవేళ ఏదైనా ప్రభుత్వ పరీక్ష పేపర్ లీక్ అయినా, పరీక్షలు వాయిదా పడినా లేదా ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగినా బాధిత విద్యార్థులందరికీ రూ. 10,000 చొప్పున పరిహారం చెల్లించాలి.
  • ప్రత్యేక రైళ్ల ఏర్పాటు: లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యే భారీ నియామక పరీక్షల (Mass Recruitment Exams) సమయంలో విద్యార్థుల ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలి.
  • 72 గంటల్లోగా తిరిగి పరీక్ష: ఏదైనా కారణం చేత పరీక్ష రద్దయితే, తదుపరి 72 గంటల్లోగా ప్రత్యామ్నాయ తేదీని కేటాయించి పరీక్షను పూర్తి చేయాలి.
  • భౌతిక మూల్యాంకనం: ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌కు స్వస్తి చెప్పి, జవాబు పత్రాలను భౌతికంగా (Physical Evaluation) మూల్యాంకనం చేయాలి.
  • వయో సడలింపు: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పరీక్షలు లేదా ఫలితాలు ఆలస్యమైతే, ప్రభావితమైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు (Age Relaxation) ఇవ్వాలి.
  • తప్పనిసరి ఆడిట్: పరీక్షలకు ముందే కంప్యూటర్ ఆధారిత పరీక్షా వ్యవస్థలపై తప్పనిసరిగా ఆడిట్‌లు నిర్వహించాలి. పరీక్షల నిర్వహణ కాంట్రాక్టులను కేవలం మెరిట్ ఆధారంగానే కేటాయించాలి.

CJP announces ‘Exam Manifesto’ : “కోటి మంది విద్యార్థులు ముఖ్యమా.. అసమర్థ మంత్రి ముఖ్యమా?”

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అభిజీత్ దీప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కోటి మందికి పైగా విద్యార్థులు అన్యాయానికి గురైనా, బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని మండిపడ్డారు. కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా అనేది ప్రధానమంత్రే తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. “వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది అనడానికి ‘బొద్దింక’ (Cockroach) ఒక సంకేతం. దేశంలోని యువత ప్రస్తుత విభజన రాజకీయాలతో విసిగిపోయింది. ఈ పాడైపోయిన వ్యవస్థను యువతే బొద్దింకలలాగా మారి సరిదిద్దుతుంది.” అని అభిజీత్ దీప్కే అన్నారు. ఈ నిరసనలు పూర్తిగా శాంతియుతంగా, రాజ్యాంగ పరిధిలోనే సాగుతాయని సీజేపీ స్పష్టం చేసింది. పుణెలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రధాన నగరాలైన జైపుర్, లఖ్​నవూ, అమృత్‌సర్, బెంగళూరులకు విస్తరించనున్నారు. కార్యాచరణలో భాగంగా..శుక్రవారం నాడు లఖ్​నవూలోని ఎకో గార్డెన్‌లో భారీ నిరసన చేపట్టనున్నారు. జూన్ 20న దేశ రాజధాని దిల్లీలోని ప్రసిద్ధ జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున విద్యార్థుల మహాధర్నా నిర్వహించనున్నారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చర్చలు జరపాల్సింది పోయి ప్రభుత్వం తమ సోషల్ మీడియా ఖాతాలను అణచివేయాలని చూస్తోందని సీజేపీ ఆరోపించింది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also :

    నేడు కొల్లూరు మూకాంబికా ఆలయానికి తమిళనాడు సీఎం

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha