Digital addiction : భారతదేశ వ్యాప్తంగా బాలలు, కౌమార దశ యువతలో క్రమంగా స్క్రీన్ టైమ్ పెరుగుతూ, డిజిటల్ వ్యస నం బారినపడుతూ, తమ ఆరోగ్యాలను మొగ్గ స్థాయిలోనే కోల్పోతున్నారని పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరికలు చేయడం గమనార్హం.
స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, గేమింగ్ యాప్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో మితిమీరిన వాడకంతో వారి చదువులపై ననే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై కూడా తీవ్ర మైన దుష్ప్రభావాలను చూపుతున్నట్లు సర్వే పేర్కొంటున్న ది. వయస్సు ఆధారిత డిజిటల్ప రిమితులను విధించ వలసిన సమయం ఆసన్నమైనదని హెచ్చరికలు చేసింది. అపరిమిత డిజిటల్ వినియోగదారుల్లో అధికంగా బాలలు, కౌమార దశ పిల్లలు ఉండడంతో రేపటి
భారత భవిష్యత్తు సంక్షోభంలో పడవచ్చని, హానికరమైన కంటెంట్ ఉన్న యాప్లో మునిగి తమ చిరు జీవితాలను చిద్రం చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డిజిటల్వ్య సనం మితిమీరితే పిల్లలు మానసిక క్షోభ, క్రియాత్మక బలహీ నతలకు దారి తీస్తుందని సర్వే నిర్వచిస్తున్నది. డిజిటల్ అడిక్షన్ హద్దులు దాటితే ఏకాగ్రత క్షీణించడం, నిద్రలేమీ సమస్యలు ఉత్పన్నం కావడం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి ప్రమాదకర స్థాయికి పెరగడం, విద్యార్జన కోరిక తగ్గడం, సామాజిక సంబంధాలు తగ్గడం, ఒంటరితనం వేధించడం, చురుకుదనం మాయంకావడం, నైపుణ్యాలు తగ్గడం, పనితీరు క్షీణించడం, ఉత్పాదకత తగ్గడం లాంటి పలు అనర్థాలు జరుగుతున్నట్లు గమనించారు.
Read Also : NEET-UG 2026 : టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు

Digital addiction
Digital addiction : డిజిటల్ ఫాస్టింగ్
పెద్దల్లో సైతం డిజిటల్ స్క్రీన్ టైమ్ పెరగడంతో సైబర్ మోసాలు, బెదిరింపులు పెరగడం, ఆన్లైన్ ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం, ఉత్పాదకత పడిపోవడం గమనిస్తున్నాం. డిజిటల్ అడిక్షన్ వలలో చిక్కి 3 నుంచి 5 గంటలకు పైగా నీలి తెరల ముందు కూర్చున్న పిల్లల్లో శారీరక శ్రమ తగ్గడం వల్లప్రమా దకర జీవనశైలి వ్యాధులు పెరగడం గమనిస్తున్నామని నిపుణులు వాచ్చరిస్తున్నారు. డిజిటల్ అడిక్షన్ దుష్ప్రభావాల ను తగ్గించేందుకు ‘డిజిటల్ ఫాస్టింగ్’ వ్రతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ప్రతి రోజు కొన్ని గంటల పాటు లేదా వారానికి 1లేదా 2రోజుల పాటుస్మార్ట్ తెరలకు దూరంగా ఉండడాన్ని డిజిటల్ ఫాస్టింగ్ (ఉపవా సం) అని పిలుస్తున్నాం. 2024లో భారత్లో ఇంటర్నెట్ వినియోగదారులు 43శాతం సామాజిక మాధ్యమాలను వాడినట్లు సర్వేలు నిర్ధారిస్తున్నాయి. పాఠశాలల్లో శారీరక వ్యాయామం తప్పనిసరి చేయడంతో పాటు స్క్రీన్లైమ్ నిర్వహణపై తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు. దీనితోపాటుగా వయస్సును బట్టి డిజిటల్ యాక్సస్ విధానాలు, హానికర కంటెంట్ వివరీతాలను అదుపుచేయడం, స్క్రీన్టైమ్ ను విధిగాతగ్గించడం జరగాలి. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్దిష్టవయస్సు కంటే తక్కు వ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించడం ఇతర దేశాలను మార్గదర్శకం చేయాలి. దక్షిణకొరియా సైతం షట్ డౌన్ చట్టంద్వారా మైనర్లు గేమింగ్ వెబ్సైట్లను వాడ కుండా పరిమితులు విధించడం హర్షదా యకం. ఇదేక్రమంలో సింగపూర్,Lఫాన్స్, స్పెయిన్, ఫిన్లాండ్, జపాన్, బ్రెజిల్, కొన్ని యూఎస్ రాష్ట్రాలు కూడా డిజిటల్ అడిక్షన్ విషయంలో తగుచర్యలను తీసుకుంటున్నాయి.
-డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

