Gold rates today:బంగారం ధరలు మళ్లీ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా ఎగబాకాయి. పెరిగిన ధరల కారణంగా ఆభరణాలు కొనేవారు ఆందోళన చెందుతున్నారు.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర భారీగా పెరిగింది. ఈ రేటు రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,37,250 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరలలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి.
Read also: Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న బంగారం ధరలు
Gold prices surge in the Hyderabad market.
భగ్గుమంటున్న వెండి రేట్లు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ ఒక్కరోజే భారీగా ఎగబాకింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,50,000కి చేరింది. పది రోజుల క్రితం వెండి ధర కాస్త తగ్గింది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే భారీగా పెరిగింది. నిన్న రూ.5,000 పెరిగిన వెండి రేటు, ఇవాళ గురువారం మరో రూ.10,000 ఎగబాకింది. ఈ వరుస పెరుగుదలతో సాధారణ ప్రజలు వెండి కొనలేని పరిస్థితి ఏర్పడింది.
Gold rates today:ధరల పెరుగుదలకు కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. షేర్ మార్కెట్ కంటే సురక్షితమైన పెట్టుబడుల వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. పసిడి వెండి కొనుగోళ్లు విపరీతంగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు అసలు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు త్వరలో ఎలా ఉంటాయో చూడాలి.
Epaper: epaper.vaartha.com

