Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు..పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు..పెరిగిన చమురు ధరలు

వార్త 3 weeks ago

Crude Oil Price: పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు సాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ (Qeshm) ద్వీపంపై అమెరికా మిలిటరీ దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో నవంబర్ 3, మంగళవారం ఆసియాన్ మార్కెట్ల ఆరంభంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.

గడిచిన ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ సైనిక ఘర్షణలు మరింత తీవ్రమవుతాయన్న ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడమే ఇందుకు ప్రధాన కారణమైంది. మంగళవారం ఉదయం ఆసియాన్ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ధ ర 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు $105.25 వద్దకు చేరింది. అదే సమయంలో అమెరికన్ చమురు డబ్ల్యూటీఐ (WTI) ధర 0.5 శాతం లాభపడి బ్యారెల్‌కు $96.93 వద్ద ట్రేడ్ అవుతోంది.

Us midterm elections: డెమెక్రాట్లు గెలిస్తే ప్రతి బిల్లును అడ్డుకుంటా: ట్రంప్‌

 Crude Oil Price

Crude Oil Price: ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ విచక్షణారహితంగా దాడులు చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ నిర్వహించామని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ అమెరికా అధికారులు పేర్కొన్నారు. దీనిని ఒక రక్షణాత్మక చర్యగా వారు అభివర్ణించారు. కేసీఎం ట్రేడ్ చీఫ్ అనలిస్ట్ టిమ్ వాటరర్ ప్రకారం.. ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదురుతుందని భావించిన మార్కెట్ సెంటిమెంట్‌ను ఈ సడన్ సైనిక దాడి తీవ్రంగా దెబ్బతీసింది.

Epaper: epaper.vaartha.com

ఇరాన్ అణు స్థావరాలపై ట్రంప్ హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha