Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశువుల ఆకలిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది?

పశువుల ఆకలిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది?

వార్త 2 weeks ago

Cattle's hunger : మానవ తప్పిదాలతో పర్యావరణ విధ్వంసం జరిగి దాని పరి ణామంగా ఏర్పడిన అసంతులనం తో సముద్ర గర్భంలో ఏర్పడుతున్న ఎల్నినో లాంటి వాతావరణ ఉత్పా తాలతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడేప్రమాదం ముంచు కొస్తుందనే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికల నేపథ్యంలో రైతాంగం ఖరీఫ్ సాగుకు సిద్ధమోతోంది.

వర్షా భావపరిస్థితుల నేపథ్యంలో బంజరు భూములలో గడ్డి పెరుగుదల కలగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఆధునిక వ్యవసాయ రంగం ట్రాక్టర్లూ, కల్టివేటర్లూ, వరి కోత యంత్రాలు, క్రిమిసంహారక మందు లను పిచికారీ చేసే సాధారణ యంత్రాలతోపాటు పాటు వాటిని స్ప్రే చేసే అత్యంత ఆధునిక డ్రోన్లను ఉపయోగిస్తు న్నప్పటికీ సేద్యానికి ఉపయోగించే నాగలితో పాటు వ్యవ సాయ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి ఉపయోగిస్తున్న బండ్లను నడిపించే ఎడ్ల పాత్ర నేటికీ కొన సాగుతుండడం తెలిసినదే. దానికి తోడు గ్రామాలలో ప్రతి ఇంటా పాడిపశువుల పెంపకం గ్రామీణ ప్రాంతాలలో నేటికీ మెజారిటీ కుటుంబాల ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగానే భావిం చక తప్పదు. పల్లెలే దేశానికి పట్టు గొమ్మలనే నానుడిలో ఆ పల్లెల భవితవ్యం పశుసంపదపైన ఆధారపడిన నేపథ్యం లో దేశానికి స్వాతంత్ర్యం రాక ముందేకాదు వచ్చిన తర్వాత సైతంపశువుల ఆకలిని తీర్చడానికి బంజరు భూముల్లో, గ్రామ కంఠం భూముల్లో, కొన్ని ప్రాంతాలలో రెవిన్యూ భూముల్లో పశువుల మేతకు అవసరమైన గడ్డి విస్తారంగా లభించేది.

Read Also : Sangareddy mineral deposits: సంగారెడ్డిలో ఖనిజ నిక్షేపాలు.. కేంద్ర జియోలాజికల్ సర్వేలో వెల్లడి

 Cattle’s hunger

Cattle’s hunger : ప్రభుత్వ భూముల దురాక్రమణ

స్థానిక గ్రామ పంచాయతీల నేతృత్వంలో ఆయా గ్రామాలలో పశుసంపదకు అవసరమైన గడ్డిని అందించడం కోసం గోచార్, గైరాన్భూములను కేటాయించి వాటిని సంరక్షించే బాధ్యతను ఆయా గ్రామ పంచాయతీలే చేపట్టే వనడంలో ఎలాంటి సందేహంలేదు. ఐతే మారుతున్న కాల మాన పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల సామాజిక,ఆర్థిక అవసరాలను బట్టి సదరు ప్రభుత్వభూములలో నుండిరైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠ ధామాలకు, పల్లె ప్రకృతి వనా లకు, క్రీడాప్రాంగణాలకు, కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రా లకు కొన్ని భూములను కేటాయించడం కారణంగా గ్రామ కంఠం భూముల విస్తీర్ణత తగ్గిపోతోంది. దీనికితోడు పేద లకు ఉచిత గృహ నిర్మాణాల కోసం, రోడ్ల నిర్మాణం కోసం, వ్యవసాయం కోసం సైతం సదరు ప్రభుత్వ భూములను ఉపయోగించడం మూలాన వాటి విస్తీర్ణత తగ్గిపోతుంది. దీనికి భిన్నంగా పశుసంపద సంఖ్య పెరిగిపోతుండడంతో పశువుల మేత కొరత పెరుగుతుండడం ప్రాధాన్యత సంత రించుకుంటోంది. కొన్ని గ్రామాలలో బడా బాబులు సదరు ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడుతున్న కారణం గా, మరికొన్ని ప్రాంతాలలో స్థానిక సంస్థలే తమ అవస రాల కోసం పశువుల మేతకు అవసరమైన సదరు భూము లను ఇతర పనులకు ఉపయోగిస్తున్నందున ఆ భూములు మాయమైపోతున్నవి. ఫలితంగా మేత దొరకక పశుసంపద ఆకలితో అల్లాడుతుంది.

అడవిలోకి అనుమతించకపోవడం

సొంతభూముల్లోనే పశుగ్రాసం పెంచు కోవాల్సిన పరిస్థితులు? పశువుల మేతకు గ్రామ కంఠం భూ ములు అందుబాటులోలేని నేపథ్యంలో మెజారిటీ గ్రామాల లో రైతులు తమ తమ పట్టా భూముల్లోనే పశుగ్రాసాన్ని పెంచుకోవాల్సి వస్తోంది. ఐతే భూమి లేని రైతులు మాత్రం పశువుల గడ్డిని పెంచుతున్న రైతుల నుండి గడ్డిని కొనుక్కుంటూ ఎవరి పశువుల పాకలో వారే తమ పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకోవాల్సి రావడం గమనా ర్హం. మరోపక్క నీటికొరత తదితర కారణాల సాకుతో పచ్చి గడ్డిని పండించే రైతులు అధిక ధరలకు విక్రయిస్తుండడం కొనుగోలు దారులకు ఇబ్బందిగా మారుతోంది. రిజర్వు ఫారెస్ట్ నెపంతో క్షేత్ర స్థాయి అటవీశాఖ అధికారులు అటవీ సమీప గ్రామాల రైతుల పశువులను మేత కోసం అడవిలోకి అనుమతించకపోవడం మూగ జీవాలు ఆకలికి అల మటించేలా చేస్తుండడం బాధాకరం. పలు సందర్భాల్లో మేతను సమకూర్చలేని రైతులు తమ కన్న బిడ్డల లాంటి పశువులు ఆకలితో అల్లాడుతున్న వైనాన్ని భరించలేక కబేలాలకు విక్రయిస్తుండడం చూస్తే గుండె చెరువొతోంది. ప్యాకింగ్ సౌలభ్యం నేపథ్యంలో పట్టణాలు ఎల్లలు దాటి పల్లె సీమల్లోకి ప్రవేశిస్తున్న పాలిథిన్ కవర్లను ఆహారంగా భావించి తింటున్నపశువులు అనారోగ్యంతో అకాల మృత్యు వాతపడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న ప్రమాదకరమైన పాలి థిన్ కవర్లను నిషేధించాల్సిన ప్రభుత్వ పాలన విధానాలు కాగితాలకు, కార్యాలయాలకే పరిమితమోతున్నాయనే భావన సర్వత్ర వెల్లువెత్తుతోంది.

 Cattle’s hunger

గ్రామ పంచాయతీలదే

రాజ్యాంగ నిబంధనలననుసరించి మూగ జీవాల జీవించే హక్కులను గౌరవించాల్సిన స్థానిక సంస్థలు పశువుల మేతకు అవసరమైన భూములను కాపా డాల్సిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించకపోవడం మూలాననే మేత కొరతతో పశువుల మనుగడ ప్రశ్నార్థకమో తోందని బుద్ధిజీవుల నిశ్చితాభిప్రాయం. రాజ్యాంగ నిబంధ నలను అనుసరించి మూగ జీవాల జీవించే హక్కుని కాపా డాల్సిన బాధ్యత నిస్సందేహంగా గ్రామ పంచాయతీలదే. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో పశువులను సామూహికంగా మేపడానికి అవసరమైన గోచర్, గైరానా, గ్రామకంఠం భూములను దురాక్రమణలకు లోనుగాకుండా కాపాడాలి. అదే విధంగా పంటకోత తర్వాత పంట భూము ల్లో సైతం ఓ పదిహేను రోజులపాటు పశువులను మేపవ చ్చును. గ్రామీణ ఉపాధి హామీపథకం తోడ్పాటుతో బంజరు భూములను పచ్చికను పెంచడానికి అవసరమైన సారవంత మైన భూములుగా మార్చాలి. అలా చేసినప్పుడే అందులో ఆయా గ్రామాల పశువుల అవసరాలను తీర్చే పశుగ్రాసం లభ్య మోతుంది. చట్టరీత్యా గ్రామసభ పశువుల మేతకు అవ సరమైనగడ్డిని సమకూర్చడానికి అవసరమైన సకల చర్యల ను తీసుకోవాలి. సామూహిక పచ్చిక మైదానాలను ఏర్పాటు చేస్తూ అందులో సరైనపోషక విలువలు కలిగిన సంకరజాతి గడ్డిని పెంచాలి. అందుకోసం ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఎండాకాలం లో మూగజీవాల ఆకలిని తీర్చడానికి అవసరమైన ఎండు గడ్డిని నిల్వఉంచడంతోపాటు తాగునీటి గుంటలను ఏర్పాటు చేయడం ద్వారా పశువులు తాగునీటి అవసరాలను సైతం తీర్చాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే.

-డాక్టర్ నీలం సంపత్

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha