Gold price today : పశ్చిమాసియా రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి.
ఇరాన్‌పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం దేశీయంగా ధరల పెరుగుదలకు కారణమైంది. అయితే పసిడి ప్రియులకు షాక్ తగిలినా, వెండి మాత్రం భారీగా దిగివచ్చి ఊరట కల్పించింది.
హైదరాబాద్‌లో పసిడి రేట్లు (10 గ్రాములకు):
- 24 క్యారెట్ల మేలిమి బంగారం: క్రితం రోజు రూ. 820 పెరగగా, మే 21న మరో రూ. 1,310 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 1,58,350 మార్కుకు చేరింది.
- 22 క్యారెట్ల ఆభరణాల బంగారం: ఒకే రోజులో రూ. 1,200 మేర జంప్ చేయడంతో ప్రస్తుతం తులం ధర రూ. 1,45,150 వద్దకు చేరింది.
- లలితా జువెలరీస్ రేట్లు: ప్రముఖ సంస్థ లలితా జువెలరీలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 120 పెరిగి రూ. 14,515 వద్ద, తులం ధర రూ. 1,45,150 వద్ద విక్రయించబడుతోంది. ప్లాటినం గ్రాము ధర రూ. 8,078 వద్ద ఉంది.
Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత
Gold price todayరూ. 10,000 దిగివచ్చిన వెండి:
బంగారానికి భిన్నంగా వెండి కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఇటీవల రూ. 3 లక్షల మార్కును తాకిన కిలో వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 10,000 మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,85,000 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 40 డాలర్లు తగ్గి 4,469 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్స్ 73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

