Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పటాన్‌చెరులో మహిళ దారుణ హత్య

పటాన్‌చెరులో మహిళ దారుణ హత్య

వార్త 3 weeks ago

Patancheru Murder: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుకు సమీపంలో ఓ మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలిని మంజుల (40)గా గుర్తించారు. ఆమె స్వస్థలం సదాశివపేట కాగా, ప్రస్తుతం పటాన్‌చెరు అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలాన్ని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పరిశీలించారు. క్లూస్ టీం, పటాన్‌చెరు పోలీసు సిబ్బంది సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు.ప్రాథమిక విచారణలో భాగంగా మంజుల నిన్న రాత్రి ఎవరితో కలిసి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుకు వచ్చింది? అక్కడికి రావడానికి కారణం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 Patancheru Murder

సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్, క్లూస్ టీం, పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో అత్యాచారం అనంతరం హత్య జరిగిందా? లేదా ఇతర కారణాలతో హత్యకు పాల్పడ్డారా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Note: ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా నిర్ధారణ కాని అంశాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

మహిళను థార్‌తో ఢీకొట్టి, ఆసుపత్రికి తీసుకెళ్లి.. మృతదేహాన్ని మళ్లీ రోడ్డుపై పడేసిన మహిళా డ్రైవర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha