Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పట్టపగలే బ్యాంకు దోపిడీ.. రూ. 4 కోట్ల సొత్తు అపహరణ!

పట్టపగలే బ్యాంకు దోపిడీ.. రూ. 4 కోట్ల సొత్తు అపహరణ!

వార్త 2 weeks ago

Bank robbery: జార్ఖండ్ రాష్ట్రం గిరిడీలోని ఉకో బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. ధన్‌బాద్ మార్కెట్ సమీపంలో ఉన్న ఈ బ్రాంచ్‌లోకి చొరబడిన ముసుగు దొంగలు గన్‌పాయింట్‌తో తీవ్ర అలజడి సృష్టించారు.

తుపాకులతో దాడులు, సిబ్బంది దిగ్బంధం

గురువారం రోజున ఇద్దరు బైక్‌లపై వచ్చిన ఐదుగురు దండగులు ఉకో బ్యాంక్ బ్రాంచ్‌లో దోపిడీకి పాల్పడ్డారు. గిరిడీ ఎస్పీ బిమల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఐదుగురు నేరస్థుల్లో ఒకరు హెల్మెట్ ధరించగా, మిగిలిన నలుగురు ముసుగులు ధరించి ఉన్నారు. అందరి చేతుల్లో పిస్టళ్లు ఉన్నాయి.

మొదట మేనేజర్ కేబిన్‌లోకి ప్రవేశించిన నేరస్థులు ఆయన నుదుటిపై పిస్టల్ పెట్టి బెదిరించారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, వినియోగదారులను ఒకే చోట బంధించి, అందరి ముఖాలకు, చేతులకు అడ్హెసివ్ టేప్ వేసి కట్టేశారు.

రూ. 10 లక్షల నగదు, కోట్ల విలువైన బంగారం దోపిడీ

దోపిడీ క్రమంలో మేనేజర్‌ను బెదిరించి గోల్డ్ లాకర్ తాళాలు తీసుకున్నారు. లాకర్‌లోని నగదు, బంగారంతో దొంగలు పరారయ్యారు. దోపిడీ సమయంలో నిందితులు బయటకు వెళ్తున్న దృశ్యాలు బయటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, లోపల ఉన్న సాక్ష్యాలను నాశనం చేసేందుకు బ్యాంక్ సీసీటీవీ డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు రూ. 10 లక్షల నగదుతో పాటు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

పిఎస్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే…

ఈ ఉకో బ్యాంక్ బ్రాంచ్ ధన్‌బాద్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో, మార్కెట్ నడిబొడ్డున ఉంది. పోలీస్ స్టేషన్‌కి అతి సమీపంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.

సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను నిర్బంధించారు. నేరస్థులు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తెలంగాణలో తుఫాన్ బీభత్సం.. 11 మంది SDRF సిబ్బంది గల్లంతు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha