Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

వార్త 2 weeks ago

Niranjan Died : తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ (17) అరుదైన జన్యుపరమైన వ్యాధితో (Rare Genetic Disease) పోరాడుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.

చిన్న వయసు నుంచే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, నిరంజన్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఇష్టపడేవాడు. గత కొన్ని రోజులుగా అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రి మరియు ఇంటి వద్దే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, నేడు పరిస్థితి మరింత క్షీణించి ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోవడంతో వరంగల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన చిరుప్రాయపు అభిమాని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

‘ఓజీ’ని కలిసి చూద్దామన్నారు.. పవన్ పరామర్శ గుర్తులను తలుచుకుంటూ..

నిరంజన్ మరణంతో అతను పవన్ కళ్యాణ్‌ను కలిసిన అపురూప క్షణాలు మరోసారి అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. నిరంజన్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరంజన్ పక్కన కూర్చుని, ప్రేమగా ముచ్చటించి, అతనికి కొన్ని బహుమతులను కూడా అందించారు. అంతేకాకుండా, “మనమిద్దరం కలిసి థియేటర్లో ‘OG’ సినిమా చూద్దాం, నువ్వు త్వరగా కోలుకోవాలి” అంటూ ఆ చిన్నారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. ఆ నటుడిని కలిసిన ఆనందంలో నిరంజన్ కొన్ని రోజులు ఎంతో ఉత్సాహంగా గడిపాడు. కానీ, విధి ఆ చిన్నారికి ‘ఓజీ’ చిత్రాన్ని చూసే అవకాశం ఇవ్వకుండానే తీసుకువెళ్లిపోయింది. నిరంజన్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తారని, ఆ కుటుంబానికి అండగా ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

'ధరణి' పోర్టల్ భూ అక్రమాలపై సిట్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha