Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స

పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స

వార్త 0 months ago

Pawan kalyan health update:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా పూర్తయింది. గత పదేళ్లుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యులు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు.

2016లో జరిగిన ప్రమాదం తర్వాత భుజం కండరాలు దెబ్బతినడంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రజా సేవలో బిజీగా ఉండటం వల్ల ఆ నొప్పిని పట్టించుకోకుండా పర్యటనలు, సభల్లో పాల్గొన్నారు. తాజాగా వైద్యుల సూచన మేరకు ముంబయికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, భుజాల్లో రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read also: Pawan Kalyan CM: కాంగ్రెస్ వైపు వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు!

 Pawan Kalyan shoulder surgery recovery

మూడు వారాల విశ్రాంతి అవసరం

రెండు భుజాలకు సర్జరీ అవసరమైనప్పటికీ, ఒకేసారి చేయడం వల్ల నొప్పి తీవ్రంగా ఉంటుందని వైద్యులు భావించారు. అందుకే ముందుగా కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేసి, దెబ్బతిన్న కండరాలను సరిచేశారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వైద్యులు ఆయనకు కనీసం మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రాజకీయ పనుల వల్ల గతంలో సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్లే గాయం ముదిరిందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎటువంటి ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరో భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను రెండు నెలల తర్వాత నిర్వహించాలని వైద్య బృందం నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్నారు.

Pawan kalyan health update:ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ పట్టుదల

గత కొన్ని నెలల క్రితం ముక్కుకు సర్జరీ చేయించుకున్న సమయంలోనే, వైద్యులు భుజం పరిస్థితిని గమనించి వెంటనే చికిత్స తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎన్నో సభల్లో పాల్గొనడం వల్ల భుజాలపై భారం పెరిగింది. ప్రజలను కలవడానికి వచ్చిన వారు చేతులు పట్టుకుని లాగడం, సెల్ఫీల కోసం దగ్గరకు రావడం వంటి సందర్భాల్లో కూడా ఆయనకు నొప్పి పెరిగేది. అయినప్పటికీ ప్రజా సేవను ఆపకుండా పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన త్వరగా కోలుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. విశ్రాంతి పూర్తయిన తర్వాత మరింత ఉత్సాహంతో ఆయన ప్రజల మధ్యకు వస్తారని స్పష్టమవుతోంది. త్వరలోనే ఆయన మళ్ళీ అధికారిక విధుల్లో పాల్గొననున్నారు.

Epaper: epaper.vaartha.com

చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha