Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్

వార్త 1 week ago

OG 2 : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'OG 2 ' (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో ఒక సంచలన అప్‌డేట్ బయటకు వచ్చింది.

OG సీక్వెల్ అయిన ‘OG 2’ కోసం మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారు. ఈ సీక్వెల్ కథా చర్చలకు సంబంధించి దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక ప్రత్యేకమైన ఫోటోను చిత్ర నిర్మాణ సంస్థ (DVV ఎంటర్‌టైన్‌మెంట్స్) అధికారికంగా విడుదల చేసింది. “మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మా ప్రయాణం మొదలైంది” అనే అర్థం వచ్చేలా చిత్ర బృందం చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ వారం ‘సండే కిక్’ మామూలుగా లేదు. ఫ్యాన్స్ అందరూ ఈ అప్‌డేట్‌ను లైక్స్, షేర్స్ మరియు కామెంట్స్‌తో ఇంటర్నెట్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

 OG 2 Movie

తమన్ మ్యూజిక్ మ్యాజిక్.. భారీ అంచనాలు

రన్ రాజా రన్, సాహో, OG చిత్రాలతో తనదైన శైలి యాక్షన్‌ను తెరకెక్కించిన దర్శకుడు సుజీత్, ఈ ‘OG 2’ స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్.. ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించబోతుండటం విశేషం. తమన్ మ్యూజిక్, సుజీత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్ అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొనడం సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని, పట్టుదలను చూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha