Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ కు గాయం అని తెలిసి ఎమోషనలైనా బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కు గాయం అని తెలిసి ఎమోషనలైనా బండ్ల గణేష్

వార్త 3 weeks ago

Pawan Injury : టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజాల గాయం గురించి తెలిసి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ వార్త విన్నప్పటి నుండి తనకు రాత్రంతా నిద్ర రాలేదని ఆయన సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక చేదు సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గుర్రంపై నుండి కింద పడటంతో ఆయన భుజానికి తీవ్ర గాయమైందని, ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మళ్లీ తలపుకొచ్చి తనను కలచివేస్తున్నాయని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

నిర్మాతపై పవన్‌కు ఉన్న నిబద్ధత.. బండ్ల గణేష్ కృతజ్ఞత

ఆనాడు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు పవన్ కళ్యాణ్‌ను పరిశీలించి, తక్షణమే సర్జరీ (శస్త్రచికిత్స) చేయించుకోవాలని సూచించారని బండ్ల గణేష్ వెల్లడించారు. అయితే, సర్జరీ చేయించుకుంటే షూటింగ్ ఆగిపోతుందని, తద్వారా నిర్మాతకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని పవన్ కళ్యాణ్ భావించారని చెప్పారు. తన ఆరోగ్యం కంటే నిర్మాత క్షేమమే ముఖ్యమనుకుని, తీవ్ర నొప్పితో బాధపడుతున్నప్పటికీ సర్జరీని వాయిదా వేసుకుని ‘గబ్బర్ సింగ్’ సినిమాను పూర్తి చేశారని కొనియాడారు. “ఆ రోజు మీరు చేసిన సాయాన్ని, నాపై చూపిన ప్రేమాభిమానాలను ఈ జన్మలో మర్చిపోలేను, ఆ రుణాన్ని తీర్చుకోలేను” అని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..'జైభీమ్' కాంబో రిపీట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha