Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పలువురు రాజకీయ, సినీ, మీడియా రంగా ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఆయన కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స (Shoulder Surgery) జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్న నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి (డెప్యూటీ స్పీకర్) శ్రీ రఘురామ కృష్ణం రాజు గారితో పాటు ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ కావాలని వారు ఆకాంక్షించారు. ఈ పరామర్శల పర్వంతో డిప్యూటీ సీఎం నివాసం వద్ద కాస్త సందడి వాతావరణం నెలకొంది.

పరామర్శించిన వారిలో రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్ ఉన్నారు. వీరితో పాటు కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన సీనియర్ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి కూడా ఉన్నారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, చట్టరంగం నుండి ప్రముఖ న్యాయవాది అశ్విన్ కుమార్, మరియు మీడియా రంగ ప్రముఖులైన మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ వెంకటేశ్వర రావు తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు.

