Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు. అనుదీప్ అరెస్ట్

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు. అనుదీప్ అరెస్ట్

వార్త 2 months ago

Anudeep Arrested: సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులపై కామెడీ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల ఒక షోలో పవన్ కళ్యాణ్, నిహారిక కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Read Also: Drugs Seized Pulivendula: పులివెందులలో డ్రగ్ నెట్ వర్క్ ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

 Inappropriate comments on Pawan Kalyan… Anudeep arrested

ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు

ఈ వివాదంపై కాకినాడకు చెందిన జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి పరారీలో ఉన్న అనుదీప్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, చివరకు అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన అనుదీప్‌ను, ఏప్రిల్ 14న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక పార్కులో తన తండ్రితో ఉన్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జనసైనికుల ఆగ్రహం

కామెడీ ముసుగులో వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని, ముఖ్యంగా కుటుంబ సభ్యులను లాగడం పట్ల అభిమానులు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై కాకినాడకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతమార్పిడి ఒత్తిడి.. నిందితుల అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha