Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ కవిత డిమాండ్

పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ కవిత డిమాండ్

వార్త 2 weeks ago

Pawan Kalyan Vs Kavitha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.

తెలంగాణవాదాన్ని పవన్ కళ్యాణ్ వేర్పాటువాదం మరియు ఉగ్రవాదంతో పోల్చారంటూ భారత్ రాష్ట్ర సమితి (BRS) కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఒక రాజకీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్‌పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై, ఇక్కడి ఉద్యమ అస్తిత్వంపై మాట్లాడే హక్కు ఏపీ ఉపముఖ్యమంత్రికి లేదంటూ కవిత తన ప్రసంగంలో తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Read Also : రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 30నే రైతు భరోసా నిధులు

 Kalvakuntla Kavitha

అవతరణ దినోత్సవం వేళ సినిమా యాక్టర్లకు ఇక్కడేం పని?

తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను తప్పుగా చిత్రీకరించడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “వేర్పాటువాదం అంటే దేశం నుంచి వేరుపడాలని కోరడం.. కానీ తెలంగాణ ప్రజలు ఎన్నడూ ఆ మాట అనలేదు, కేవలం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు” అని ఆమె స్పష్టం చేశారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో.. ఇక్కడి ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడానికి కేవలం ఒక సినిమా యాక్టర్‌గా ఉన్న వ్యక్తికి ఇక్కడేం పని అంటూ పవన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనంగా ఉంటున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ అస్తిత్వాన్ని తక్కువ చేసినందుకు ఆయనపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha