Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవర్‌ప్లేలో సూర్యవంశీ విధ్వంసం.. 6 ఓవర్లకు 97/1

పవర్‌ప్లేలో సూర్యవంశీ విధ్వంసం.. 6 ఓవర్లకు 97/1

వార్త 2 months ago

RR vs RCB IPL Live Score: 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

జోష్ హాజిల్‌వుడ్ వంటి మేటి బౌలర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకుని ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.

RR vs RCB IPL Live Score: జురెల్ మెరుపులు

జైస్వాల్ (13) త్వరగానే అవుట్ అయినప్పటికీ, వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ ఏమాత్రం తగ్గలేదు. అభినందన్ సింగ్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకుపడి 27 పరుగులు రాబట్టాడు. దీంతో రాజస్థాన్ పవర్‌ప్లే ముగిసేసరికి రికార్డు స్థాయిలో 97 పరుగులు చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ విజయానికి 84 బంతుల్లో కేవలం 105 పరుగులు మాత్రమే కావాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాజస్థాన్ ముందు 202 రన్స్ టార్గెట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha