25 percent seats:ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించే విషయమై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా అలాగే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
గతంలో కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ అధికారులు కేవలం ఉత్తర్వులతోనే సరిపెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
Assistant Professor Jobs: ఉస్మానియా వర్సిటీలో అత్యధిక ఉద్యోగ ఖాళీలు
25 percent of seats in private schools for poor children
సుప్రీంకోర్టు సీరియస్ హెచ్చరికలు
ఇటీవల ప్రైవేటు స్కూళ్లలో నిరుపేద పిల్లలకు 25 శాతం సీట్లు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ చట్టం అమలు కోసం గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అప్పట్లో విద్యాశాఖ దీనికి అంగీకరించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఇప్పుడు అత్యున్నత ధర్మాసనం ఆదేశాల కారణంగా అధికారులు మరోసారి చట్టం అమలుపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.
25 percent seats:అమలుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు
ఇప్పటివరకు కేవలం కాగితాలకే పరిమితమైన ఈ నిబంధనను ఇకపై క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో అర్హులైన పేద పిల్లలకు ఉచిత లేదా రాయితీ విద్య అందేలా చూసేందుకు విద్యాశాఖ త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే గొప్ప అవకాశం దక్కనుంది.
Epaper: epaper.vaartha.com

