Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

వార్త 1 month ago

Indiramma Indlu Scheme: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.

సోమవారం మండల పరిధిలోని రామోజీ పల్లి గ్రామంలో ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్నారు.

Read Also : TG Rain Alert: రానున్న 2 గంటల్లో వర్షం.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 The goal is to fulfill the dream of owning a home.. Patholla Sanjeeva Reddy.

Indiramma Indlu Scheme: లబ్ధిదారురాలితో కలిసి గృహప్రవేశం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకం ద్వారా గృహాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ నూతన ప్రవేశ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని ప్రజలు వాటిని సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు నారా గౌడ్. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెరుమాల్ గౌడ్, సర్పంచ్లు జయశీల, అనంతరావు. సాయిలు, శ్రీనివాస్, నాయకులు దాచా సంగమేశ్వర్, రమేష్ బాబు, చందర్ తదితరులు పాల్గొన్నారు..

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ధీమా.. మళ్లీ బీఆర్ఎస్‌ను పట్టాలెక్కిస్తాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha