మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయ విజయం తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ‘పెద్ది’ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చరణ్ పట్టుదలతో ఉన్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 26కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) తన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ విడుదల గురించి మాట్లాడుతూ.. జూన్ 26న ‘పెద్ది’ వస్తున్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
Read Also : Iran War: నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్

షూటింగ్ బ్యాలెన్స్ – వాయిదాకు అసలు కారణం ఇదేనా?
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం నెల రోజులే సమయం ఉన్నప్పటికీ, ఇంకా కొన్ని కీలకమైన సీన్స్ చిత్రీకరించాల్సి ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ పై తీయాల్సిన ఒక భారీ స్పెషల్ సాంగ్ తో పాటు మరికొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోకపోవచ్చనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ఏప్రిల్ నుంచి జూన్ నెలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
మెగా అభిమానుల ఆందోళన – అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్
రామ్ చరణ్‌ను వెండితెరపై చూసి చాలా కాలం కావడంతో మెగా అభిమానులు ఏప్రిల్ 30 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు విడుదల వాయిదా పడుతుందనే వార్తలతో వారు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే, బుచ్చిబాబు క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదని భావిస్తున్నందున, కొంచెం ఆలస్యమైనా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ లేదా దర్శకుడు బుచ్చిబాబు నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ సస్పెన్స్‌కు తెరపడదు. జూన్ 26న సినిమా వస్తే అది సమ్మర్ ముగింపులో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఓట్లు వస్తాయంటే, ప్రధాని మోదీ ఆలయాల గురించి మాట్లాడుతారు: రాహుల్ గాంధీ

